NBK111: 'క్వీన్' ఎంట్రీ.. గోపిచంద్ మలినేని రూట్ మార్చాడా?
పోస్టర్‌ను గమనిస్తే.. వెనుక ఓల్డ్ మ్యాప్ బ్యాక్‌డ్రాప్‌లో, ఒక యుద్ధభూమి, అక్కడ పడి ఉన్న కత్తులు, చిరిగిపోయిన ఎర్ర జెండా, దూరంగా ఒక పురాతన కోట కనిపిస్తున్నాయి.
By: M Prashanth | 17 Nov 2025 6:44 PM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద వసూళ్లను బాగానే రాబట్టింది. ఇక ఆ సినిమా తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలపడంతో, ఫ్యాన్స్ మరోసారి అలాంటి పవర్ ప్యాక్డ్ మాస్ యాక్షన్ సినిమాను ఆశించారు. కానీ, ఈసారి గోపిచంద్ తన పంథా మార్చినట్లు కనిపిస్తోంది.
NBK111 వ ప్రాజెక్టుగా ఈ కాంబినేషన్ రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ అప్‌డేట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, ఇది రొటీన్ కమర్షియల్ సినిమా కాదని, ఏదో కొత్త తరహా ప్రయత్నంలా అనిపిస్తోంది.
పోస్టర్‌ను గమనిస్తే.. వెనుక ఓల్డ్ మ్యాప్ బ్యాక్‌డ్రాప్‌లో, ఒక యుద్ధభూమి, అక్కడ పడి ఉన్న కత్తులు, చిరిగిపోయిన ఎర్ర జెండా, దూరంగా ఒక పురాతన కోట కనిపిస్తున్నాయి. ఈ విజువల్స్ అన్నీ ఒక చారిత్రక లేదా భారీ పీరియడ్ వార్ డ్రామాను తలపిస్తున్నాయి. గోపిచంద్ మలినేని తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి, బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక కొత్త జానర్‌ను ఎంచుకున్నట్లు ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.
అన్నింటికంటే ముఖ్యంగా, పోస్టర్‌పై ఉన్న ఒకే ఒక్క నోట్ ఇప్పుడు సస్పెన్స్‌ను పెంచుతోంది. ఒక శక్తివంతమైన, గంభీరమైన రాణి అధ్యాయం రేపు ప్రారంభం.. అని పోస్టర్‌పై ప్రకటించారు. ఇంతకీ ఆ 'క్వీన్' ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని హీరోయిన్ పాత్ర పరిచయమా? లేక కథ మొత్తం ఆ రాణి చుట్టూనే తిరుగుతుందా? అనే ఆసక్తి మొదలైంది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'NBK111'పై ఉన్న ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే, రేపు (నవంబర్ 18) ఉదయం 10:40 గంటలకు రాబోయే ఆ "క్వీన్ చాప్టర్" అప్‌డేట్ వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
