బాలయ్య కోసం కొత్తగా ట్రై చేస్తున్న గోపీచంద్
ఆల్రెడీ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వీర సింహారెడ్డి సినిమా రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
By: Sravani Lakshmi Srungarapu | 3 Oct 2025 5:00 PM ISTగాడ్ ఆఫ్ మాసెస్, నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లతో మంచి జోష్ మీదున్నారు. సక్సెస్ ఇస్తున్న సంతోషంలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
అఖండ2ను పూర్తి చేసే పనిలో బాలయ్య
అసలే అఖండకు సీక్వెల్ పైగా బాలయ్య- బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం అఖండ2 ను పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య, డిసెంబర్ 5న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అఖండ2 తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
మరోసారి గోపీచంద్ తో సినిమా
ఆల్రెడీ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వీర సింహారెడ్డి సినిమా రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రెండోసారి బాలయ్య- గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? ఏ నేపథ్యంలో ఉంటుందా అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే బాలయ్య కెరీర్లో 111వ సినిమాగా రానున్న ఈ మూవీపై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
డ్యూయల్ రోల్ లో బాలయ్య
NBK111లో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది. ఆ పాత్రల్ని గోపీచంద్, స్పార్టకస్ మరియు అలెగ్జాండర్ నుంచి ఇన్‌స్పైర్ అయి డెవలప్ చేశారని సమాచారం. కాగా ఈ సినిమాను గోపీచంద్ సోషియో ఫాంటసీ జానర్ లో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కించనున్నారని, గోపీచంద్ గత చిత్రాలకు భిన్నంగా NBK111 ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య పలు సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేయగా, వాటిలో ఎక్కువ సినిమాలు బాలయ్యకు మంచి ఫలితాన్నే అందించాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నడని తెలిసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
