కాంతార సినిమాటోగ్రాఫర్ కు టాలీవుడ్ లో బంపరాఫర్
దీన్ని బట్టి చూస్తుంటే కాంతార1 కోసం ఆయన బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలంగానే ఇప్పుడు అరవింద్ కు ఓ టాలీవుడ్ ఆఫర్ దక్కింది.
By: Sravani Lakshmi Srungarapu | 18 Oct 2025 3:00 AM ISTఏ సినిమా అయినా తెరపై బాగా కనిపించాలంటే మంచి కథ, డైరెక్షన్ మాత్రమే సరిపోదు. దానికి తగ్గ విజువల్స్ కూడా ఉండాలి. అది సినిమాటోగ్రాఫర్ చేతిలోనే ఉంటుంది. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సింక్ లో ఉన్నప్పుడు మాత్రమే విజువల్స్ విషయంలో మంచి అవుట్‌పుట్ వస్తుంది. లేదంటే డైరెక్టర్ ఊహించుకున్నది ఒకటి, సినిమాటోగ్రాఫర్ చూపించేది ఒకటి అవుతుంది.
అందుకే ఫిల్మ్ మేకింగ్ లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా కీలకం అంటూ ఉంటారు. సినిమా ఎలా ఉన్నా కొన్ని సినిమాలను చూడాలనిపిస్తుంది దానికి కారణం కూడా విజువల్స్, దాని వెనుక ఉన్న సినిమాటోగ్రాఫరే. ఇక అసలు విషయానికొస్తే కన్నడ సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ ఇప్పుడు ఓ బంపరాఫర్ అందుకున్నారు. టాలీవుడ్ లో ఆయనకో మంచి ఛాన్స్ దక్కింది.
కాంతార1 కు భారీ ప్రశంసలు
చార్లీ, కాంతార, కాంతార చాప్టర్1 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు అరవింద్ కశ్యప్, రీసెంట్ గా కాంతార: చాప్టర్1 సినిమాలో ఆయన పనితనానికి ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. కాంతార1 లోని కొన్ని ఎపిసోడ్స్ కోసం చాలా కష్టపడ్డామని, అడవులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నామని అరవింద్ చెప్పిన వెల్లడించారు కూడా.
NBK111కు కన్నడ సినిమాటోగ్రాఫర్
దీన్ని బట్టి చూస్తుంటే కాంతార1 కోసం ఆయన బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలంగానే ఇప్పుడు అరవింద్ కు ఓ టాలీవుడ్ ఆఫర్ దక్కింది. అదే నందమూరి బాలకృష్ణ సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ కు అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించారు. వచ్చే నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవనుండగా, అరవింద్ ఆల్రెడీ టీమ్ లో చేరినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాలయ్య- గోపీచంద్ కాంబినేషన్ వచ్చిన వీర సింహారెడ్డి సినిమా హిట్టవడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ హిట్టైతే అరవింద్ కశ్యప్ కు తెలుగులో మరిన్ని అవకాశాలొచ్చే వీలుంది.
