Begin typing your search above and press return to search.

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ నుంచి తొలి పాట ‘దాదా ధమాకా’ నవంబర్ 13న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట పోస్టర్‌లో బాలయ్య, నర్గీస్ ఫక్రీ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  M Prashanth   |   8 Nov 2026 1:22 PM IST
దాదా సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!
X

బాలకృష్ణ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా తమన్ సంగీతం అందించిన సినిమాల్లో బాలయ్య ఎలివేషన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా'కు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కి పోస్టర్ తో ఒక కొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు. అందులో బాలయ్య స్టైలిష్ లుక్‌తో కనిపించారు.

'దాదా ధమాకా' అంటూ మొదటి పాటను నవంబర్ 13న విడుదల చేయబోతున్నారు. పోస్టర్‌లో బాలయ్య చేతిలో గన్ పట్టుకుని, సన్‌గ్లాసెస్‌తో కనిపిస్తుండగా పక్కనే నర్గీస్ ఫక్రీ ఉన్నారు. ఇద్దరి స్టెప్పులను హైలైట్ చేసేలా డిజైన్ చేసిన ఈ పోస్టర్ చూస్తే భారీ డ్యాన్స్ నంబర్‌కు ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో ఇలాంటి పాటలకు థియేటర్లలో మంచి ఆదరణ ఉంటుంది.

తమన్, బాలయ్య కాంబినేషన్‌కు ఇప్పటికే బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 'అఖండ'లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్ కాగా, 'వీరసింహారెడ్డి'లో జై బాలయ్య పాట అభిమానులను ఆకట్టుకున్నాయి. 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్', 'అఖండ 2' సినిమాలకూ తమన్ సంగీతం అందించారు. దీంతో 'దాదా' పాటలను కూడా ఆ సినిమాలతో పోల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి సింగిల్‌తోనే మంచి మాస్ బీట్ అందించాల్సి ఉంటుంది.

ఇక గోపీచంద్ మలినేని గతంలో బాలయ్యతో తీసిన 'వీరసింహారెడ్డి'లో పాటలను మాస్ ప్రేక్షకులకు తగ్గట్టుగా రూపొందించారు. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తుండటంతో మ్యూజిక్ విషయంలోనూ ఆ తరహా ప్లానింగ్ కనిపిస్తోంది. అయితే 'దాదా' నేపథ్యం మాత్రం వేరు. 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ కథతో తెరకెక్కుతున్న సినిమాలో స్టైలిష్ డ్యాన్స్ నంబర్‌ను ఎలా ఉపయోగించుకుంటారనేది చూడాలి. ఇప్పటికే వచ్చిన పోస్టర్లలో బాలయ్యను రగ్గడ్ లుక్‌తో చూపించగా ఈసారి పూర్తిగా పార్టీ మూడ్‌లో కనిపిస్తున్నారు.

మరోవైపు బాలయ్య సినిమాల్లో పాటలకు యూట్యూబ్ వ్యూస్‌తో పాటు థియేటర్ రెస్పాన్స్ కూడా ముఖ్యం. 'జై బాలయ్య' లాంటి పాటలు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. అదే సమయంలో 'దాదా' కోసం తమన్ కొత్త సౌండ్ తీసుకొస్తారా, లేక తనకు బాగా కలిసొచ్చిన మాస్ బీట్స్‌నే కొనసాగిస్తారా అనే అంచనాలు ఉన్నాయి. నర్గీస్ ఫక్రీతో బాలయ్య కాంబినేషన్ కూడా ఈ పాటకు మరో పాజిటివ్ వైబ్ ఇచ్చే అవకాశం ఉంది.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న 'దాదా' డిసెంబర్ 24న విడుదల కానుంది. గతంలో బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన 'వీరసింహారెడ్డి' సంక్రాంతి సీజన్‌లో మంచి వసూళ్లు సాధించింది. ఈసారి క్రిస్మస్ సెలవులను ఉపయోగించుకునేలా రిలీజ్ ప్లాన్ చేశారు. నవంబర్ 13న మొదటి పాట వచ్చిన తర్వాత మిగతా సాంగ్స్, ట్రైలర్‌తో డిసెంబర్ విడుదలకు ప్రమోషన్లు కొనసాగించనున్నారు.