Begin typing your search above and press return to search.

బాల‌య్య ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో ఊగిపోవాలి: సంయుక్త‌

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ న‌టించిన `అఖండ 2` డిసెంబ‌ర్ 5న అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

By:  Sivaji Kontham   |   18 Nov 2025 10:35 PM IST
బాల‌య్య ఫ్యాన్స్ థియేట‌ర్ల‌లో ఊగిపోవాలి: సంయుక్త‌
X

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ న‌టించిన `అఖండ 2` డిసెంబ‌ర్ 5న అత్యంత భారీగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ `అఖండ`కు సీక్వెల్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాల‌య్య బాబు ఎన‌ర్జీతో పాటు, మాస్ విశ్వ‌రూపాన్ని చూడ‌బోతున్నామ‌ని ఇప్ప‌టికే బోయపాటి శ్రీను వెల్ల‌డించారు. ఇక బాల‌య్య మాస్ ఫ్యాన్స్ కి స్పెష‌ల్ ట్రీటిచ్చేందుకు రెండవ సింగిల్ `జాజికాయ జాజికాయ`ను టీమ్ విడుద‌ల చేసింది.

ఈ పాట‌కు బాల‌య్య మాస్ స్టెప్స్, సంయుక్త మీన‌న్ గ్లామ‌ర్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఒక భారీ సెట్ లో దీనిని విజువ‌ల్ రిచ్ గా చిత్రీక‌రించిన తీరుకు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఇక సాంగ్ ఆద్యంతం సంయుక్త మీన‌న్ గ్లామ‌ర్ ఎలివేష‌న్, ఎనర్జిటిక్ స్టెప్పులు మాస్ ని ఆక‌ట్టుకున్నాయి.

సాంగ్ లాంచ్ వేడుక‌లో సంయుక్త మీన‌న్ మాట్లాడుతూ.. ``నేను తెలుగు క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి పెద్ద అభిమానిని. థియేట‌ర్ల‌లో పండ‌గ వాతావ‌ర‌ణం రావాలంటే బోయ‌పాటి- బాల‌య్య బాబు కాంబినేష‌న్ సినిమానే రావాలి. ఈ పాట బ‌ర్త్ డే నేప‌థ్యంలో వ‌చ్చే పాట‌. దీనిని న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల‌ను ఆక‌ర్షించేలా తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప్లాన్ చేసారు. బాల‌య్య ఫ్యాన్స్ డ్యాన్సులు చేయాల‌ని అన్నారు. దానికి త‌గ్గ‌ట్టే భాను మాస్ట‌ర్ స్టెప్పుల‌ను కంపోజ్ చేసారు. నేను ఈ స్టెప్పుల్ని బాగా ఎంజాయ్ చేసాను. ఈ సినిమాలో ప్ర‌త్యేక పాటలో అవ‌కాశం రాగానే వెంట‌నే ఓకే చేసాను. నా పాత్ర గురించి చెప్పాల‌ని ఉన్నా దానిలో ఒక సస్పెన్స్ ఉంది. అందుకే చెప్ప‌లేక‌పోతున్నాను`` అని పేర్కొంది.

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. `బజరంగీ భాయిజాన్` ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఓ కీల‌క పాత్ర‌ధారి. డిసెంబర్ 5న అత్యంత భారీగా ఈ సినిమా విడుద‌ల కానుంది.