Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా హీట్: డాన్ ఎన్బీకేతో త‌ల‌ప‌డే ప‌వ‌ర్‌ఫుల్ రోల్?

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొంద‌నున్న‌ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

By:  Sivaji Kontham   |   6 May 2026 11:17 AM IST
పాన్ ఇండియా హీట్: డాన్ ఎన్బీకేతో త‌ల‌ప‌డే ప‌వ‌ర్‌ఫుల్ రోల్?
X

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ - స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొంద‌నున్న‌ భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో.. కొరటాల శివ తన దగ్గరున్న పవర్‌ఫుల్ మాఫియా బ్యాక్‌డ్రాప్ కథను బాలయ్యకు వినిపించి ఓకే చేయించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుండటమే కాకుండా.. ఇందులో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో లేదా పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా కనిపిస్తారనే వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కీలక పాత్ర పోషించనున్నార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్: కథానాయకుడు-మహానాయకుడు సినిమాల్లో బసవతారకం పాత్రలో బాలయ్య మాతృమూర్తిగా ఒదిగిపోయిన విద్యాబాలన్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఎన్బీకే సినిమాలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో త‌న‌ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. బాలయ్య మాఫియా డాన్ అయితే.. విద్యాబాలన్ ఆయనను ఎదిరించే ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మ‌రోవైపు బాల‌న్ పాత్ర‌ను కేవ‌లం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కే ప‌రిమితం చేస్తారా? అన్న గుసగుస కూడా వినిపిస్తోంది. అయితే బాల‌న్ లాంటి ప్ర‌తిభావ‌నిని వంద‌శాతం కొర‌టాల స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని అంచ‌నాలున్నాయి.

కొరటాల శివ తన సినిమాల్లో కేవలం హీరోలకే కాకుండా మహిళా పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. విద్యాబాలన్ వంటి ప్రతిభావంతురాలైన నటిని కేవలం హీరోయిన్‌గా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్ర కోసం ఎంచుకున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బాలయ్య స్వయంగా విద్యాబాలన్ నటనపై గతంలో ప్రశంసలు కురిపించిన సంగ‌తి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. ఆగస్ట్ నుండి కొరటాల ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. చెరుకూరి సుధాకర్ - సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అధికారిక ప్రకటన వస్తే తప్ప విద్యాబాలన్ పోలీస్ ఆఫీసరా కాదా అన్నది తెలియదు. కానీ ఈ వార్త మాత్రం ప్ర‌స్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. విద్యాబాలన్ లాంటి పెర్ఫార్మర్ ఎన్బీకే లాంటి అగ్ర హీరో ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఇతర సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ సినిమాలకు కూడా ఆమె పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

అంచ‌నాలు పెంచుతున్న‌ క్రేజీ కాంబో

నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ రాసే పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామా తోడవ్వడం టాలీవుడ్‌లో ఇది ఒక సంచలనంగా మారింది. సాధారణంగా కొరటాల తన కథల్లో హీరోలను చాలా హుందాగా చూపిస్తూనే... వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే సామాజిక సందేశాన్ని జోడిస్తారు. ఇప్పుడు బాలయ్య వంటి సీనియర్ హీరోతో మాఫియా - పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తున్నారంటే అది కేవలం యాక్షన్ చిత్రంగా మాత్రమే కాకుండా ఇన్ డెప్త్ ఉన్న కథగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే డైలాగులు, కొరటాల మార్క్ మేకింగ్‌లో కలిస్తే అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.

ఈ ప్రాజెక్ట్ చుట్టూ వినిపిస్తున్న విద్యాబాలన్, సంజయ్ దత్ వంటి పేర్లు సినిమాపై పాన్-ఇండియా స్థాయిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత విద్యాబాలన్ మళ్లీ తెలుగు తెరపై బాలయ్య సరసన కనిపిస్తే అది ఒక ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలాగే సంజయ్ దత్ వంటి స్టార్ నటుడిని కొరటాల ఎలా ఉపయోగిస్తారనేది మరో ఆసక్తికర అంశం. గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. ఏకకాలంలో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తుండటం ఆయన వేగాన్ని సూచిస్తోంది. 2027 వేసవిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచే పొలిటికల్ థ్రిల్లర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.