Begin typing your search above and press return to search.

బాలయ్య మళ్లీ ద్విపాత్రాభినయం..?

ఆల్రెడీ అఖండ 2 సినిమాతో నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ ఈసారి గోపీచంద్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో రాబోతున్నారు.

By:  Ramesh Boddu   |   4 Nov 2025 2:00 PM IST
బాలయ్య మళ్లీ ద్విపాత్రాభినయం..?
X

జాత్ తో హిందీలో కూడా సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈసారి మళ్లీ బాలయ్యతో మరో క్రేజీ మూవీకి రంగ సిద్ధం చేసుకున్నాడు. NBK 111 సినిమా ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని తెలిసిందే. ఈ సినిమా లొకేషన్స్ కోసం గోపీచంద్ మలినేని అండ్ టీం రాజస్థాన్ లో వేట ప్రారంభించారు. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ అఖండ 2 సినిమాతో నేషనల్ వైడ్ బజ్ క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ ఈసారి గోపీచంద్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో రాబోతున్నారు.

బాలకృష్ణ గోపీచంద్ ఆల్రెడీ వీర సింహా రెడ్డి..

ఐతే బాలకృష్ణ గోపీచంద్ ఆల్రెడీ వీర సింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. రెండు పాత్రలు ఫ్యాన్స్ ని మెప్పించాయి. ఐతే అందులో ఓల్డ్ క్యారెక్టర్ మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది. ఐతే బాలకృష్ణ 111 సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ 111 సినిమాలో కూడా ఆయన డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఈసారి ఒక రోల్ కాదు రెండు రోల్స్ కూడా ఒకదానికి మించి మరొకటి అనేలా ఉంటాయని తెలుస్తుంది.

ముఖ్యంగా హిస్టారికల్ నేపథ్యంలో వచ్చే రోల్ లో బాలయ్య అదరగొట్టేస్తారని అంటున్నారు. గోపీచంద్ ఈసారి కేవలం మాస్ కథే కాదు కంటెంట్ ఉన్న క్రేజీ స్టోరీతో వస్తున్నారని అంటున్నారు. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన గోపీచంద్ ఈ సినిమాతో బాలయ్యను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సక్సెస్ సాధిస్తున్న ఈ టైం లో బాలయ్యతో గోపీచంద్ అటెంప్ట్ క్రేజీగా మారుతుంది.

గోపీచంద్ మీద నందమూరి ఫ్యాన్స్ పూర్తి కాన్ఫిడెన్స్..

అంతేకాదు ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా గోపీచంద్ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాను కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లేదా 2027 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వీర సింహా రెడ్డితో బాలయ్యకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మీద నందమూరి ఫ్యాన్స్ పూర్తి కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు. బాలకృష్ణ కూడా అఖండ 2 రిలీజ్ హడావిడి పూర్తి కాగానే నెక్స్ట్ ఆ సినిమాపై ఫోకస్ చేస్తారని తెలుస్తుంది.

బాలకృష్ణ 111 సినిమాతో పాటుగా 112వ సినిమాగా ఆదిత్య 999 డిస్కషన్ లో ఉంది. ఐతే ఆ సినిమాను ముందు బాలకృష్ణ సొంతంగా డైరెక్ట్ చేయాలని అనుకున్నా అది రిస్క్ అనిపించి క్రిష్ డైరెక్షన్ లో చేయాలని అనుకుంటున్నారట. ఐతే క్రిష్ కూడా రీసెంట్ గా మంచి ఫాం కనబరచలేదు. అనుష్క ఘాటితో సత్తా చాటతాడని అనుకున్న అతను తీవ్రంగా డిజప్పాయింట్ చేశాడు. మరి క్రిష్ చేతుల్లోనే ఆదిత్య 999 ఉందా మరో డైరెక్టర్ ని తీసుకుంటారా అన్నది చూడాలి.