Begin typing your search above and press return to search.

స్టార్‌ భార్యతో యంగ్‌ హీరో రొమాన్స్‌...!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో పెళ్లి తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచిన హీరోయిన్స్ సైతం ఉన్నారు. అయితే సౌత్‌లో మాత్రం అలా లేదు.

By:  Ramesh Palla   |   19 Sept 2025 11:00 PM IST
స్టార్‌ భార్యతో యంగ్‌ హీరో రొమాన్స్‌...!
X

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెళ్లి తర్వాత సినిమాలను తగ్గిస్తారు, కొందరు గ్లామర్‌ డోస్‌ తగ్గిస్తారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో పెళ్లి తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచిన హీరోయిన్స్ సైతం ఉన్నారు. అయితే సౌత్‌లో మాత్రం అలా లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో నటిస్తున్న హీరోయిన్స్ పెళ్లి అయిన తర్వాత అదే తీరున సినిమాలు చేయడం మనం చూస్తున్నాం. ఒక హీరోయిన్‌ పెళ్లి అయిన వెంటనే సినిమాలు మానేయడం అనేది ఇప్పుడు లేదు. వారి ఇమేజ్‌కి తగ్గట్లుగా సినిమాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మలయాళ స్టార్‌ నటుడు ఫహద్‌ ఫాసిల్‌ భార్య నజ్రియా నజీమ్‌ అనే విషయం తెల్సిందే. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన నజ్రియా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఆ మధ్య కొన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ఈ అమ్మడు చేసిన విషయం తెల్సిందే.

ఫహద్‌ ఫాసిల్‌ భార్య నజ్రియా నజీమ్‌..

ఒక వైపు ఫహద్‌ వరుసగా సినిమాలు చేస్తూ ఉంటే, నజ్రియా సినిమాలను తగ్గించింది అంటూ ఆ మధ్య కొందరు విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలను తిప్పి కొట్టే విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు ఈమె రెడీ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అందులో కొన్ని రొమాంటిక్ కమర్షియల్‌ రోల్స్‌ సైతం ఉండబోతున్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యంగ్‌ హీరో టోవినో థామస్ కు జోడీగా నజ్రియా నటించబోతుందని, వీరిద్దరి కాంబోలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ రూపొందబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రానప్పటికీ మలయాళ మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. ప్రస్తుతం నజ్రియా చేస్తున్న సినిమాల తర్వాత ఈ సినిమాను కమిట్‌ అవ్వబోతుందని అంటున్నారు.

టోవినో థామస్‌కి జోడీగా నజ్రియా

మలయాళంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న యంగ్‌ హీరో టోవినో థామస్‌. ఈయన నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. అందుకే ఈయన సినిమాలకు మంచి స్పందన వస్తుంది. తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నజ్రియా మరియు టోవినో కలిసి నటించబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆకట్టుకునే విధంగా ఈ జంట ఉంటుందని ఇప్పటి నుంచే టాక్ మొదలు అయింది. ప్రస్తుతానికి సినిమా యూనిట్‌ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ మలయాళ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో వీరి కాంబో మూవీ ఉంటుందని తెలుస్తోంది.

అంటే సుందరానికి..

ముహ్సిన్‌ పరారి దర్శకత్వంలో ఈ సినిమాను ఏవీఏ ప్రొడక్షన్స్‌లో ప్రముఖ నిర్మాత నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యాయి అని, షూటింగ్‌ ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ కాస్టింగ్‌ గురించిన క్లారిటీ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆకట్టుకునే కథ, కథనంతో సినిమాను రూపొందిస్తున్నారు. అంతే కాకుండా నజ్రియా, టోవినో కాంబో సీన్స్ తప్పకుండా అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఉంటాయి అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబో కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఫహద్‌ తెలుగులో పుష్ప సినిమాతో ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. మరిన్ని సినిమాలు ఈయన చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. ఫహద్‌ సైతం మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను అంటున్నాడు. నజ్రియా తెలుగులో అంటే సుందరానికి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మళ్లీ ఈమె తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.