Begin typing your search above and press return to search.

నజ్రియా నజిమ్ వ్యాఖ్యలపై ముదురుతున్న చర్చ!

తాజాగా నజ్రియా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ రహస్య పోస్ట్ నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 1:02 PM IST
నజ్రియా నజిమ్ వ్యాఖ్యలపై ముదురుతున్న చర్చ!
X

మాలీవుడ్ బ్యూటీ న‌జ్రియా న‌జీమ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `అంటే సుంద‌రానికీ` అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆ త‌ర్వాత మాత్రం అవ‌కాశాలు రాలేదు. దీంతో సొంత ప‌రిశ్ర‌మకే ప‌రిమిత‌మై సినిమాలు చేసుకుంటుంది. గ్లామ‌ర్ పాత్రల విష‌యంలో కండీష‌న్ల‌తో ప‌ని చేస్తుంది. పెద‌వి ముద్దులు..రొమాంటిక్ స‌న్నివేశాలంటే న‌జ్రియా ముందు న‌డ‌వ‌వు. దీంతో మేక‌ర్స్ కూడా అమ్మ‌డిని లైట్ తీసుకుంటున్నారు. కానీ సొంత ప‌రిశ్ర‌మ‌లో మాత్రం తిరుగు లేని నాయిక‌గా కొన‌సాగుతుంది.

అలాగే అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ అందిస్తూ రెగ్యుల‌ర్ గా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాల‌ను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా నజ్రియా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ రహస్య పోస్ట్ నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీసింది.

అమ్మ‌డు ఇన్ స్టా వేదిక‌గా ..`ఎద్దులు ఎరుపు రంగు జెండాల (రెడ్ ఫ్లాగ్స్) వెనుక పరిగెత్తడం పిచ్చితనం అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని అని.. కానీ ఇప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నాను` అనే అర్థం వచ్చేలా ఒక వ్యాఖ్యానాన్ని పంచుకున్నారు.

సాధారణంగా ఎద్దులు ఎరుపు రంగును చూసి ఆకర్షితమై లేదా కోపంతో దాని వెనుక పడతాయనే నమ్మకం ఉంది. ఆ పోలికను తన జీవితానికి ...ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ నజ్రియా చేసిన ఈ వింత వ్యాఖ్యలు అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆధునిక కాలంలో యువత పరిభాషలో రెడ్ ఫ్లాగ్స్ అనే పదాన్ని ఒక వ్యక్తిలోని ప్రతికూల లక్షణాలు, ప్రమాదకరమైన అలవాట్లు లేదా ఒక బంధంలో ఉండే హెచ్చరిక సంకేతాలను సూచించడానికి ఉపయోగిస్తుంటారు. నజ్రియా ఈ నిర్దిష్టమైన పదాన్ని ఉపయోగించడంతో ఆమె ఏదైనా? ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారా లేదా తన జీవితంలోని కొన్ని నిర్ణయాల గురించి ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి.దీంతో ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ పోస్ట్ నెగిటివ్ గా మారుతుందా? అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంది.

నజ్రియా - నటుడు ఫహద్ ఫాజిల్ చిత్ర పరిశ్రమలో ఆద‌ర్శ‌దంప‌త‌లు. ప్రేమపూర్వకమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతో బలంగా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజా పోస్ట్‌ను న‌జ్రియా వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదని మెజారిటీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో సినిమా .. వెబ్ సిరీస్ ప్రమోషన్ల కోసం సెలబ్రిటీలు ఇలాంటి ఆసక్తిని రేకెత్తించే వ్యూహాలను అనుసరించడం సర్వసాధారణంగా మారిపోయింది.

ఈనేప‌థ్యంలో ఇది న‌జ్రియా కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్‌లో భాగం కావచ్చనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. నజ్రియా చేసిన రెడ్ ఫ్లాగ్ వ్యాఖ్యలు ఆమె నటించబోయే కొత్త పాత్రకు సంబంధించిన సంకేతమా? కేవలం ఒక సరదా పోస్టా లేదా బ్రాండ్ ప్రమోషనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలింది. ఈ విషయంలో న‌జ్రియా నుండి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అధికారికంగా వివరణ‌ రాలేదు.