క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కిరాక్ లుక్.. నజ్రియా ఫోటోషూట్ వైరల్!
మలయాళీ భామ, నటి నజ్రియా నజీమ్ తన సహజమైన అందం, క్యూట్ హావభావాలు మరియు ముద్దులొలికే చిరునవ్వుతో దక్షిణాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.
By: Madhu Reddy | 24 Aug 2026 5:00 AM ISTమలయాళీ భామ, నటి నజ్రియా నజీమ్ తన సహజమైన అందం, క్యూట్ హావభావాలు మరియు ముద్దులొలికే చిరునవ్వుతో దక్షిణాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఎలాంటి కృత్రిమత్వం లేని సహజ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. క్లాసీ అండ్ క్యాజువల్ లుక్‌లో ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
బ్లాక్ గ్లామర్ విత్ క్యూట్ స్పెట్స్:
తాజా ఫోటోషూట్‌లో నజ్రియా చాలా సింపుల్‌గా, ట్రెండీగా కనిపించి అలరించారు. బ్లాక్ రంగు లాంగ్ స్లీవ్ గ్రాఫిక్ టాప్, దానికి మ్యాచింగ్‌గా బ్లాక్ కలర్ నీట్ బెన్నీ ధరించారు. వీటికి తోడు పారదర్శకమైన స్క్వేర్ ఫ్రేమ్ గ్లాసెస్ పెట్టుకుని క్యూట్ అండ్ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయారు. ఇక చిలిపి కళ్లతో, చెరగని నవ్వుతో ఆమె ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తమిళం, మలయాళంలో సంచలన విజయాలు:
2013లో వచ్చిన మలయాళ చిత్రం 'మాడ్ డాడ్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నజ్రియా, ఆ తర్వాత తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన 'నేరం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ 'రాజా రాణి' చిత్రంలో ఐటీ ఉద్యోగి కీర్తన పాత్రలో ఆమె కనబరిచిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగులోనూ ఆమెకు విశేషమైన అభిమాన గణం ఏర్పడింది.
తెలుగులోనూ చెరగని ముద్ర:
కేవలం మలయాళం, తమిళ భాషల్లోనే కాకుండా.. న్యాచురల్ స్టార్ నాని సరసన 'అంటే సుందరానికి!' సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడి అభిమానుల మనసులను కూడా గెలుచుకున్నారు నజ్రియా. ఇక విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలోనూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు.
హీరో ఫహద్ ఫాజిల్ భార్యగా, విలక్షణ నటిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న నజ్రియా నజీమ్.. ఈ క్యాజువల్ లుక్ ఫోటోషూట్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక సహజమైన అందం, అమాయకమైన చూపులతో మిరుమిట్లు గొలుపుతున్న నజ్రియా లేటెస్ట్ క్లిక్స్‌పై మీరూ ఒక లుక్కేసేయండి.
