Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు హీరోలు న‌య‌న‌తార ఫ్యామిలీ నుంచి.. లుక్కు అదుర్స్!

తమ ఇంటిని ఒక సుందరమైన ప్రకృతి వాతావరణంలా తీర్చిదిద్దిన ఈ దంపతులు.. వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

By:  Sivaji Kontham   |   28 Sept 2026 10:40 AM IST
ఇద్ద‌రు హీరోలు న‌య‌న‌తార ఫ్యామిలీ నుంచి.. లుక్కు అదుర్స్!
X

స్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల కుమారులు ఉయిర్ రుద్రనీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్ పుట్టినరోజును అత్యంత అద్భుతంగా, ఆనందంగా జరుపుకున్నారు. తమ ఇంటిని ఒక సుందరమైన ప్రకృతి వాతావరణంలా తీర్చిదిద్దిన ఈ దంపతులు.. వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ పోస్ట్ క్షణాల వ్యవధిలోనే నెట్టింట వైరల్ అయింది.

ఈ బర్త్‌డే వేడుకలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేచర్-థీమ్ డెకరేషన్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్లాక్ పాంథర్, థోర్ థీమ్‌లతో తయారు చేసిన కేకులు, రకరకాల డెజర్ట్‌లు పిల్లలను, అతిథులను ఎంతగానో అలరించాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, నటి పర్ఫ్యూమ్ మైలీ, అంజన రంగన్ వంటి ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఈ కవలలకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. న‌య‌న‌తార కుటుంబం నుంచి ఇద్ద‌రు బాల హీరోలు రెడీ అయిపోతున్నార‌ని కూడా కొంద‌రు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వేడుక ప్రత్యేకతలతో పాటు నయనతార-విఘ్నేష్ లవ్ స్టోరీకి పునాది వేసిన `నానుమ్ రౌడీ దాన్` సినిమా విడుదలై 12 ఏళ్లు పూర్తి కావడాన్ని కూడా అభిమానులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఒడుదొడుకులను దాటుకుని... నయనతార తాను కోరుకున్న సంతోషకరమైన సంసార జీవితాన్ని సొంతం చేసుకోవడంపై అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకలో నయనతార ధరించిన స్టైలిష్ చీర.. ఆమె సహజసిద్ధమైన అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇండస్ట్రీలో ఎన్నో విమర్శలను, ట్రోల్స్‌ను ఎదుర్కొని తనదైన ప్రతిభతో `లేడీ సూపర్‌స్టార్‌`గా ఎదిగిన నయనతార ముఖంలో ఈరోజు అసలైన సంతోషం కనిపిస్తోందని అభిమానులు భావోద్వేగంతో పేర్కొన్నారు. న‌య‌న్ కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దిష్టి తగలకుండా హారతి ఇవ్వాలని కామెంట్లు పెట్టడం విశేషం.

తెలుగు, తమిళం సహా పలు భాషలకు చెందిన అభిమానులు ఈ జంటకు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ వేడుక కేవలం ఒక పుట్టినరోజు వేడుక మాత్రమే కాకుండా.. నయనతార వ్యక్తిగత జీవితంలో సాధించిన విజయానికి, త‌న‌పై అభిమానులు చూపించే నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలిచింది.