Begin typing your search above and press return to search.

పిక్ ఆఫ్ ది డే.. ఒకే ఫ్రేమ్ లో నయనతార, త్రిష.. ఇప్పటికీ చెరగని అందం!

తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించడమే కాకుండా ఆ హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియా ద్వారా ఇద్దరు షేర్ చేసి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.

By:  Madhu Reddy   |   20 Jan 2026 10:42 AM IST
పిక్ ఆఫ్ ది డే.. ఒకే ఫ్రేమ్ లో నయనతార, త్రిష.. ఇప్పటికీ చెరగని అందం!
X

టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా పేరు దక్కించుకోవడమే కాకుండా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లకు పైగానే అవుతున్నా.. అదే అందంతో.. అదే స్టార్డంతో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు నయనతార, త్రిష . అలాంటి ఈ ఇద్దరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా కోల్డ్ వార్ జరుగుతోంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నయనతార - త్రిష ఒకరికొకరు ఎదురుపడినా కూడా మాట్లాడరు అని.. వీరిద్దరికి ఒకరంటే ఒకరు నచ్చదు అంటూ కొంతమంది ఫేక్ వార్తలు సృష్టించారు. అయితే ఇప్పుడు ఆ వార్తలకు ఈ ఇద్దరు చెక్ పెట్టారు అని చెప్పవచ్చు.




తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించడమే కాకుండా ఆ హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియా ద్వారా ఇద్దరు షేర్ చేసి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. స్టార్ హీరోయిన్ త్రిష ఇద్దరు తాజాగా దుబాయ్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ సముద్రంలో యాచ్ పై సేదతీరుతో హ్యాపీగా గడుపుతున్నారు. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, హార్ట్ ఎమోజీలతో పోస్ట్ చేశారు. దీనికి తోడు నయనతార ఈ ఫోటోలను పంచుకుంటూ "ముస్తఫా ముస్తఫా"అనే పాటను జోడించి తమ స్నేహ బంధానికి ఎండింగ్ లేదు అంటూ చెప్పుకొచ్చింది.





ఇకపోతే తాజాగా వీరిద్దరూ ఈ ఫోటోలను షేర్ చేసుకోగా.. అందులో నయనతార బ్లాక్ వీ నెక్ టాప్ జీన్స్ ధరించి స్టైలిష్ గా కనిపించగా.. త్రిష బ్లాక్ టీ షర్ట్, జాకెట్ తో కూల్ లుక్ తో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఇది నిజమా? లేక ఏఐ ఫోటోలేమో అనుకున్నాము? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఏదైతేనేం ఎట్టకేలకు కలిసిపోయారు. 40ల్లో కూడా తమ అందంతో మెస్మరైజ్ చేస్తూ కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.





ఇకపోతే వీరిద్దరూ కలవడాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు అనే విషయానికొస్తే.. 2008 -2010 సంవత్సర కాలంలో తమిళ సినిమా కురివి విషయంలోనే వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా గొడవ జరిగిందని.. అప్పట్లో పెద్ద ఎత్తున మీడియా కథనాలు వచ్చాయి. మొదట నయనతారను అనుకున్నారని.. ఆ తర్వాత ఆమెను తప్పించి త్రిషను ఈ సినిమాలో తీసుకోవడం వల్లే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే వార్తలు వినిపించాయి. అయితే దీనిపై అప్పట్లోనే త్రిష స్పందిస్తూ.." మీడియా ఊహాగానాలే తప్ప తమ మధ్య ఎటువంటి పెద్దపెద్ద గొడవలు లేవు. చిన్నపాటి వ్యక్తిగత అపార్ధాలు మాత్రమే ఉన్నాయని" చెప్పి క్లారిటీ ఇచ్చింది..





అటు నయనతార కూడా.." తమ మధ్య చిన్న చిన్న స్పర్ధలు ఉండడం నిజమే.. అయితే త్రిష స్వయంగా ముందుకొచ్చి మాట్లాడడం ఎంతో మెచ్చుకోదగిన అంశం" అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి కనిపించలేదు అయితే ఇన్నేళ్ల తర్వాత తొలిసారి వీళ్లిద్దరు కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య దూరం తగ్గిపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇది కదా అసలైన ఫోటో "పిక్ ఆఫ్ ది డే" అంటూ కామెంట్లు చేస్తూ ఈ ఇద్దరి కలయికపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.