Begin typing your search above and press return to search.

నయన్ సెలక్షన్ లో నయా ఫార్ములా.. అదే బిగ్ ఛాలెంజ్!

లేడీ సూపర్‌ స్టార్ నయనతార అంటే ఒకప్పుడు గ్లామర్, స్టార్ హీరోల సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్లు గుర్తొచ్చేవి.

By:  M Prashanth   |   7 Sept 2026 11:00 PM IST
నయన్ సెలక్షన్ లో నయా ఫార్ములా.. అదే బిగ్ ఛాలెంజ్!
X

లేడీ సూపర్‌ స్టార్ నయనతార అంటే ఒకప్పుడు గ్లామర్, స్టార్ హీరోల సినిమాలు, కమర్షియల్ ఎంటర్టైనర్లు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆమె సినిమా సెలక్షన్‌ లో ఛేంజ్ కనిపిస్తోంది. కథలో తన పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది? ఆ క్యారెక్టర్‌ కు ప్రేక్షకులతో ఎలాంటి కనెక్షన్ ఉంటుంది? అనే విషయాలపై నయన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆమెకున్న భారీ స్టార్ ఇమేజ్ మాత్రం కొత్త ఛాలెంజ్‌ గా మారుతోంది.

నయనతార కెరీర్‌ ను గమనిస్తే.. హీరోయిన్‌ గా మొదలై లేడీ సూపర్‌ స్టార్‌ గా ఎదిగిన తీరు చాలా స్పెషల్. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తన మార్కెట్‌ ను క్రియేట్ చేసుకుంది. ఒక స్టేజ్ లో హీరో లేకపోయినా నయనతార పేరు మీద సినిమాకు ఓపెనింగ్స్ వచ్చే రేంజ్ కు చేరుకుంది. దీంతో ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలు తయారయ్యే పరిస్థితి కూడా వచ్చింది.

అయితే ఇప్పుడు ఆ ఇమేజ్‌ నే మెయింటైన్ చేయడం ఆమెకు పెద్ద సవాల్‌గా మారుతోంది. నయనతార నుంచి ఆడియన్స్ కేవలం మంచి యాక్టింగ్ ను మాత్రమే ఆశించడం లేదు. ఆమె స్థాయికి తగ్గ రోల్, స్ట్రాంగ్ స్టోరీ, స్పెషల్ కాన్సెప్ట్ ను కోరుకుంటున్నారు. అంటే.. సాధారణ హీరోయిన్ పాత్రలో కనిపిస్తే సరిపోని పరిస్థితి. అదే సమయంలో ప్రతి సినిమాను లేడీ ఓరియెంటెడ్‌ గా మార్చడం కూడా పాజిబుల్ కాదు.

ఇక్కడే నయన్ కొత్త సెలక్షన్ ఫార్ములా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో భాగమవుతూనే.. మరోవైపు తన రోల్ కు స్పెషాలిటీ ఉన్న ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటోంది. పెద్ద హీరోతో సినిమా అయినా, హీరోయిన్ చుట్టూ తిరిగే కథ అయినా.. తన పాత్రకు గుర్తుండిపోయే స్పేస్ ఉండేలా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మరో ఛేంజ్ కూడా ఉంది. గతంలో నయన్ ను స్క్రీన్‌ పై చూడటమే ప్రేక్షకులకు పెద్ద అట్రాక్షన్.

ఇప్పుడు మాత్రం ఆమె రోల్ ఎలా ఉంటుంది? ఆ రోల్ ఏం చేస్తుంది? కథను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది? అనే ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. అంటే స్టార్ నయనతార కంటే.. నటిగా నయనతారను చూపించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడే అసలు బిగ్ ఛాలెంజ్ ఉంది. ఆమె స్టార్‌ డమ్ ఎంత పెరిగితే.. రోల్స్ పై అంచనాలు కూడా అంతే పెరుగుతాయి. కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తే కొందరు ప్రేక్షకులు కనెక్ట్ కావాలి.

కమర్షియల్‌ గా వెళ్లాలంటే మరికొందరి అంచనాలను అందుకోవాలి. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం నయనతార ముందున్న అసలు పరీక్ష ఇదే. స్టార్ ఇమేజ్‌ తగ్గించకుండా.. నటిగా కొత్తదనాన్ని చూపించాలి. తనకు ఇప్పటికే ఉన్న మార్కెట్‌ కాపాడుకుంటూనే.. కొత్త జెనరేషన్ కు కూడా కనెక్ట్ అయ్యే రోల్స్ ఎంచుకోవాలి. ఆమె సెలక్షన్‌ లో కనిపిస్తున్న ఆ కొత్త ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది రాబోయే సినిమాలతోనే తేలనుంది.