లేడీ సూపర్ స్టార్ పర్పెక్ట్ ప్లానింగ్!
లేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 19 Jan 2026 10:45 AM ISTలేడీ సూపర్ స్టార్ నయనతార సౌత్ లో ఎంత పెద్ద హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిన ట్రెడింగ్లో ఉన్న నెంబర్ వన్ బ్యూటీ. అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్ కూడా ఆమె. సౌత్ లో అన్ని పరిశ్రమలు ఆమెతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాయి. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్లు కోసం క్యూలో ఉంటారు? అంటే అతి శయోక్తి కాదు. దీనంతంటికీ కారణం నయనతార తనను తాను బిల్డ్ చేసుకోవడమే. నలుగురిలో ఒకరిలా కాకుండా? నలుగురికి భిన్నంగా ఉండటమే ఆక్రేజ్కి కారణమైంది. వృత్తి, వ్యక్తగతంగా నయన్ ఎంతో స్పెషల్ గా కనిపిస్తుంది.
నటిగా మాత్రం భిన్నమైన స్ట్రాటజీతోనే అడుగులు వేస్తోంది. క్లాస్ మాస్ ఇమేజ్ ని తెలివిగా బ్యాలెన్స్ చేయడం తనకు తెలిసినట్లుగా మరో నటికి తెలియడం లేదనొచ్చు. కోలీవుడ్ స్టార్స్ తో నటిస్తూనే తెలుగులో సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తోంది. ఆ తర్వాత తరం హీరోలతో సినిమాలు చేయడం లేదు. అవకాశాలు వస్తున్నా? స్కిప్ కొడుతుంది. వాళ్లతో నటించిన సినిమాలు ఫెయిలైతే? ఆ ప్రభావం తర్వాత సినిమాలపై పడుతోంది అని భావించి సెలక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోల సినిమాలు ప్లాప్ అయినా? ఆ ఇంపాక్ట్ తనపై పెద్దగా పడటం లేదు. ప్లాప్ క్రెడింట్ అంతా హీరో ఖాతాలోకే వెళ్లిపోతుంది.
హిట్ అయితే హీరోతో పాటు హీరోయిన్ కి పేరొస్తుంది. ఇది తెలుగు సినిమాల పరంగా నయన్ ఆడుతోన్న తెలివైన ఆట. కోలీవుడ్ లో మాత్రం కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూనే లేడీ ఓరియేంటెడ్ నాయికగానూ సత్తా చాటే ప్రయత్నా లు చేస్తోంది. దురదృష్టం కొద్ది లేడీ ఓ రియేంటెడ్ చిత్రాలు సక్సెస్ అవ్వడం లేదు. సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా సరైన ఫలితాలు రావడం లేదు. నిజంగా అదే జరిగిన రోజు నయన్ ఇమేజ్ నాలిగింతలు రెట్టింపు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నెట్ ప్లిక్స్ డాక్యుమెంటరీల్లో సైతం నయన్ నటిస్తోంది. కానీ సీరియస్ గా డాక్యుమెంటరీలపై పని చేయలేదు. అవకాశం వస్తే తప్ప సీరియస్ గా తీసుకోవడం లేదు. కానీ కొత్త ఏడాదిలో వాటిపైనా దృష్టి పెడుతుందన్నది తాజా సమాచారం. ఇదే ఏడాది అమ్మడు తొమ్మిది-పది సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతుంది. ఇప్పటికే `మనశంకరవరప్రసాద్ గారు` విజయంతో బోణీ కొట్టేసింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమా సక్సెస్ పుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే 200 కోట్ల వసూళ్లను సాధించింది. 300 కోట్ల వసూళ్లను క్రాస్ చేస్తుందనే అంచనాలున్నాయి.
