నయనతార ద్వంద్వ వైఖరి ఫాలో అవుతోందా?
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార తను నటించే ప్రాజెక్ట్‌ల విషయంలో కండీషన్స్ పెడుతుంటారన్నది అందరికి తెలిసిందే.
By: Ravindar Gorantla | 8 April 2026 7:40 PM ISTలేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార తను నటించే ప్రాజెక్ట్‌ల విషయంలో కండీషన్స్ పెడుతుంటారన్నది అందరికి తెలిసిందే. సినిమా అంగీకరించే ముందే జరిగే అగ్రమెంట్‌లో తాను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననని, ఈ కండీషన్ మీకు ఇష్టమైతేనే సినిమా చేస్తానని ఖరాకండీగా చెప్పేస్తుంటుంది. అలా ఓకే అనుకున్న వాళ్లు నయనతో సినిమాలు ఓకే చేయించుకోవడం, ఆమె క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడం చేస్తుంటారు. మరి కొంత మంది మేకర్స్ ప్రమోషన్స్‌కి రానప్పుడు తనకు మనకు అవసరం లేదని మరో నాయికలో సరిపెట్టుకోవడం అందరికి తెలిసిందే.
అయితే నయన్ తాజాగా ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని ఫాలో అవుతోందా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం రీసెంట్‌గా జరిగిన ఓ సంఘటనే. వరుస బ్లాక్ బ్టర్లతో యంగ్ డైరెక్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్న డైరెక్టర్, హీరో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన మూవీ `లవ్ ఇన్సూరెన్స్ కంపనీ`. కృతిశెట్టి కథానాయిక. ఎస్.జె. సూర్య కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. 2040 నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే సినిమాగా దీన్ని దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించారు.
సినిమా రిలీజ్ సందర్భంగా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నయనతార సడన్ సర్ప్రైజ్ ఇచ్చి స్టేజ్‌పైకి రావడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే ఇప్పుడు నయనని నెట్టింట ట్రోల్ అయ్యేలా చేస్తోంది. గత కొంత కాలంగా సినిమా ప్రమోషన్‌లకు దూరంగా ఉంటూ వస్తోంది నయన్ తార. ఆ కారణంగానే గతంలో శేఖర్ కమ్ముల రూపొందించిన `అనామిక` ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిందని అప్పట్లో విమర్శలొచ్చాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో నయనతార ఎందుకు ఇలా చేస్తోందనే కామెంట్‌లు సర్వత్రా వినిపించాయి.
మళ్లీ ఇన్నాళ్లకు నయనతారపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. రీసెంట్‌గా `మన శంకరవరప్రసాద్‌గారు` ప్రమోషన్స్(బహిరంగ స్టేజ్‌లలో కాకుండా రికార్డెడ్ ప్రమోషన్స్)లో పాల్గొని షాక్ ఇచ్చిన నయనతార రీసెంట్‌గా తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన `లవ్ ఇన్సూరెన్స్ కంపనీ` ఈవెంట్‌లో పాల్గొనడంతో తను ఎందుకు ఇలా ద్వంద్వ వైఖరిని ఫాలో అవుతోందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నయనతార ప్రమోషన్స్ కు సంబంధించిన టాపిక్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
