Begin typing your search above and press return to search.

2,000 తొలి పారితోషికం నుంచి 200 కోట్ల సామ్రాజ్యం: నయనతార నెక్ట్స్ అడుగు రాజకీయాల్లోకేనా?

స్వ‌యంకృషితో పెద్ద స్టార్ గా ఎదిగిన న‌య‌న‌తార భ‌విష్య‌త్ లో రాజ‌కీయాల్లోకి వ‌స్తారా రారా? అనేదానికి ఇంకా క్లారిటీ లేదు కానీ... వ‌స్తే గ‌నుక ప్ర‌జాభిమానం సంపాదించుకోవడానికి స్కోప్ లేక‌పోలేద‌నే విశ్లేష‌ణ సాగుతోంది.

By:  Sivaji Kontham   |   3 Sept 2026 6:08 AM IST
2,000 తొలి పారితోషికం నుంచి 200 కోట్ల సామ్రాజ్యం: నయనతార నెక్ట్స్ అడుగు రాజకీయాల్లోకేనా?
X

భార‌తీయ సినిమా హిస్ట‌రీలో న‌య‌న‌తార ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా ఎదిగిన తీరు అస‌మానం. జీరో నుంచి హీరోగా ఎదిగిన న‌టి. త‌లైవి అని పిలుపందుకుంటోంది. అమ్మ జ‌య‌ల‌లిత త‌ర్వాత మ‌ళ్లీ త‌లైవి అనే పిలుపు అందుకున్న మేటి న‌టి. 2000 జీతంతో మొద‌లై 18 కోట్లు అందుకునే స్థాయికి ఎదిగేసింది నయ‌న‌తార‌. గ్లామ‌ర్ రంగంలో ఒక న‌టిగా అనుకున్నంత ఎత్తుకు ఎదిగేసారు. ఇక సాధించాల్సిన ఎత్తులు ఏవైనా ఉన్నాయా? అంటే అది క‌చ్ఛితంగా ఏదో ఒక రోజు రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే.

స్వ‌యంకృషితో పెద్ద స్టార్ గా ఎదిగిన న‌య‌న‌తార భ‌విష్య‌త్ లో రాజ‌కీయాల్లోకి వ‌స్తారా రారా? అనేదానికి ఇంకా క్లారిటీ లేదు కానీ... వ‌స్తే గ‌నుక ప్ర‌జాభిమానం సంపాదించుకోవడానికి స్కోప్ లేక‌పోలేద‌నే విశ్లేష‌ణ సాగుతోంది. మేక‌ప్ వేసిన మొన‌గాడు అని నిరూపించాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. ఇప్పుడు మ‌హిళల కోటా నుంచి న‌య‌న‌తార‌కు అంతే స్కోప్ ఉంద‌ని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు. మ‌రింత దీప్ గా విశ్లేషిస్తే...

కేవలం రూ.2000 పేమెంట్ తో చిన్న మోడలింగ్ అసైన్‌మెంట్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించి.. నేడు 200 కోట్ల నిక‌ర ఆస్తుల‌తో దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని `లేడీ సూపర్ స్టార్`గా ఎదిగిన నయనతార విజయగాథ అత్యంత స్ఫూర్తిదాయకం. మలయాళంలో చిన్న వయసులోనే న‌టిగా అరంగేట్రం చేసిన న‌య‌న్ తదనంతర కాలంలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా తన సత్తా చాటుకున్నారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సినీ రంగంలో కేవలం తన పేరుతోనే సినిమాలను బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిపి చరిత్ర సృష్టించారు. మాయ, అరమ్, కోలమావు కోకిల వంటి సోలో చిత్రాలు ఆమెకు ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

ఆర్థిక ప్రగతితో పాటు బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల నుంచి 18 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న నయనతార.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా కోట్ల‌లో ఆర్జిస్తున్నారు. `రౌడీ పిక్చర్స్` నిర్మాణ సంస్థ, `9స్కిన్` బ్యూటీ బ్రాండ్ వంటి వ్యాపార భాగస్వామ్యాలతో పాటు చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాల్లో రూ. కోట్లాది రూపాయ‌ల‌ విలువైన లగ్జరీ ప్రాపర్టీలు న‌య‌న్‌కు సొంతం. సొంతంగా రూ. 50 కోట్ల ఖ‌రీదైన‌ ప్రైవేట్ జెట్.. లగ్జరీ కార్ల తో అత్యంత విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాధిస్తున్నారు.

సినిమా - వ్యాపార రంగాల్లో అనుకున్న ఎత్తులకు చేరిన ఈ కథానాయిక భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దివంగత నాయకురాలు జయలలిత తర్వాత తమిళనాట `తలైవి`గా అశేష ప్రజాదరణ పొందిన నటి నయనతారే కావడం ఈ ఊహాగానాలకు ప్రధాన బలాన్నిస్తోంది. స్వయంకృషితో ఎదిగిన న‌య‌న్‌కు సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో ఉన్న ఆదరణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కలిసివచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దళపతి విజయ్ వంటి స్టార్ హీరోలు సొంత పార్టీలతో రాజకీయా రంగేట్రం చేసినట్లే.. మహిళా కోటాలో నయనతారకు కూడా అపారమైన అవకాశాలున్నాయని అభిమానులు సైతం ఆశిస్తున్నారు. గతంలో జయప్రద, జయసుధ, ఖుష్బూ వంటి నటీమణుల బాటలోనే న‌య‌న‌తార‌ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ప్రత్యక్షంగా రాజకీయాల గురించి ఇప్పటివరకు స్పందించకపోయినా.. పదేళ్ల కాల వ్యవధిలోనైనా రాజకీయాల్లోకి రావడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.

మీడియా సమావేశాల్లో న‌య‌న‌తార ఆచితూచి మాట్లాడే పద్ధతి.. ప్రదర్శించే పరిణతి.. నాయకత్వ లక్షణాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఇటీవలి ప్రీ-రిలీజ్ వేదికలపై న‌య‌న్ వేషధారణ - స్పీచ్ ఒక‌ నేతకు ఉండాల్సిన గాంభీర్యాన్ని ప్రతిబింబించాయని కామెంట్స్ విన‌వస్తున్నాయి. కాలమే దీనికి సరైన సమాధానం చెప్పాల్సి ఉన్నా.. సినీ గ్లామర్ నుంచి రాజకీయాల్లోకి రావడం నయనతార వంటి బలమైన వ్యక్తిత్వానికి అసాధ్యమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.