'పేట్రియాట్'.. నయన్ ఈ కథేంటి..
మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పేట్రియాట్ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.
By: M Prashanth | 30 April 2026 4:51 PM ISTమాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పేట్రియాట్ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సీనియర్ అండ్ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తుండటం ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సినిమాలో మోహన్ లాల్ కల్నల్ రహీమ్ నాయక్ పాత్రలో కనిపించనుండగా, మమ్ముట్టి డాక్టర్ డేనియల్ జేమ్స్ పాత్రను పోషిస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఒక కీలక అక్రమ ఆపరేషన్ ను అడ్డుకునే కథాంశంతో ఆ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఇచ్చిన ఆ కథ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార తాజాగా తన లుక్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. "పేట్రియాట్.. నిరీక్షణ ముగిసింది.. తుఫాను మొదలైంది.. రేపు కేవలం ఒక విడుదల మాత్రమే కాదు... అది ఒక ఆక్రమణ.. రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పేట్రియాట్" అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
పోస్టర్ లో నయనతార చేతిలో డైరీ పట్టుకుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ఆమె రోల్ కథలో కీలక మలుపులు తీసుకురానుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ పై విభేదించడం కూడా దేశభక్తి అనే క్యాప్షన్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఒక్క డైలాగ్ తోనే సినిమా కథలో సామాజిక, రాజకీయ కోణాలు కూడా ఉండొచ్చనే అర్థమవుతోంది.
దీంతో ఆ సినిమా కేవలం యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, ఆలోచింపజేసే కంటెంట్ తో రూపొందుతుందని అంతా భావిస్తున్నారు. ఇక చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, రేవతి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని సుషిన్ శ్యామ్ అందిస్తున్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.
భారీ స్థాయిలో రూపొందిన చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు లొకేషన్లలో చిత్రీకరించారు మేకర్స్. శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్ బైజాన్, థాయ్ లాండ్ తో పాటు భారత్ లోని వైజాగ్, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. హై ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, మమ్ముట్టి- మోహన్‌లాల్ కాంబినేషన్, నయనతార కీలక పాత్ర, స్ట్రాంగ్ స్టోరీ లైన్, భారీ నిర్మాణం.. అన్నీ కలిసి పేట్రియాట్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మార్చేశాయని చెప్పాలి. మరి మే1వ తేదీన రిలీజ్ కానున్న పేట్రియాట్ మూవీ.. ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అంతా వేచి చూడాలి.
