Begin typing your search above and press return to search.

జోరు పెంచిన నయనతార.. మరో క్రేజీ హీరోతో ఛాన్స్!

ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉంటే ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలేయొచ్చు అని నిరూపిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో నయనతార ప్రథమ స్థానంలో నిలుస్తుంది.

By:  Madhu Reddy   |   8 March 2026 1:10 PM IST
జోరు పెంచిన నయనతార.. మరో క్రేజీ హీరోతో ఛాన్స్!
X

ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉంటే ఇండస్ట్రీని దశాబ్దాల పాటు ఏలేయొచ్చు అని నిరూపిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో నయనతార ప్రథమ స్థానంలో నిలుస్తుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న ఈమె తమిళ్, మలయాళం, తెలుగు , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవైపు హీరోయిన్ పాత్రలతో మరొకవైపు ఆధ్యాత్మిక పాత్రలతో మెరిసిన నయనతార.. అటు యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో కూడా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్న ఈమె.. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సీనియర్ స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

విషయంలోకి వెళ్తే .. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె.. సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత ఈమె జోరు మరింత పెరిగిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే .. 2023లో షారుక్ ఖాన్ తో కలిసి 'జవాన్' సినిమా చేసి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్ లో కూడా తన మార్కెట్ ను పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అంతేకాదు తాను పెట్టుకున్న కండిషన్స్ అన్నింటిని కూడా పక్కన పెట్టి మరీ ఈ సినిమాను ప్రమోట్ చేసి వార్తల్లో నిలిచింది నయనతార.

అయితే అలాంటి ఈమె ఇప్పుడు మరో క్రేజీ హీరో సరసన నటించే అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఒక బడా ప్రాజెక్టులో నయనతార అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై త్వరలోనే అటు చిత్ర బృందం నుండి లేదా ఇటు నయనతార నుండి అధికారిక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా వయసు పెరుగుతున్నా కూడా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు.. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కి తగ్గట్లుగానే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలిచిన నయనతార ప్రతిభతో పాటు అదృష్టాన్ని కూడా మూటగట్టుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా దూసుకుపోతూ ఉండడం విశేషం.

ఇక నయనతార ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గానే కాకుండా.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరిస్తోంది. అందులో భాగంగానే గతంలో వచ్చిన మూకుత్తి అమ్మన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న మూకుత్తి అమ్మన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వరల్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది . కన్నడ హీరో యష్ లీడ్రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఆయనకు సోదరి పాత్రలో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమయ్యింది నయనతార. అలాగే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఎన్బికె 111 సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఏదిఏమైనా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇటు హీరోయిన్ మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరిస్తోంది.