మన శంకరవరప్రసాద్ గారు.. శశిరేఖ వచ్చేసింది!
ఇప్పటికే చిరంజీవి ఫస్ట్ గ్లింప్స్ స్టైలిష్ లుక్ తో హోరెత్తించగా, ఇప్పుడు నయనతార ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.
By: M Prashanth | 1 Oct 2025 1:16 PM ISTమెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే కమర్షియల్ సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ప్రతి సారి ఆయన కొత్త లుక్, కొత్త పాత్రలో కనిపిస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడేమో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా మీద అంచనాలు పీక్‌కి చేరాయి. ఈసారి చిరు పక్కన లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి కనిపించబోతున్నారు.
ఇప్పటికే చిరంజీవి ఫస్ట్ గ్లింప్స్ స్టైలిష్ లుక్ తో హోరెత్తించగా, ఇప్పుడు నయనతార ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. పసుపు చీరలో, ఆభరణాలతో, చిరునవ్వుతో కనిపించిన ఆమె పాత్రకి “శశిరేఖ” అని పేరు పెట్టారు. ఈ లుక్ తోనే నయన్ పాత్ర చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుందని క్లారిటీ వచ్చింది.
సుశ్మిత కొణిదెల, సాహు గారపాటి సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీతో పాటు ఈసారి మెగాస్టార్ మాస్ ఎలిమెంట్స్ కూడా బాగా ఉండబోతున్నాయన్న హింట్స్ ఇప్పటికే వచ్చాయి. సంక్రాంతి 2026కి రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా పండగ బరిలో బిగ్ కాంపిటీషన్ తో వస్తుంది.
నయనతార, చిరంజీవి కాంబినేషన్ అంటే ఎప్పటినుంచో ఆడియన్స్ కి స్పెషల్ అట్రాక్షన్. గతంలో సైరా లో వీరిద్దరి కెమిస్ట్రీ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇప్పుడు మళ్లీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ డ్రామాలో స్క్రీన్ షేర్ చేయబోతుండటంతో, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నయనతార పాత్ర ఈసారి చాలా స్ట్రాంగ్ గా, సబ్టిల్ ఎమోషన్లతో నడుస్తుందని టాక్ ఉంది.
ఇక బీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మాస్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా సాంగ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, టాప్ లెవెల్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి అదనపు బలమని చెప్పాలి. పండగ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా ఇవ్వాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారని తెలుస్తోంది. మొత్తం మీద, చిరు అనిల్ కాంబోకి నయనతార రీఎంట్రీ స్పెషల్ హైలైట్ గా మారింది. “శశిరేఖ” పాత్రలో ఆమె గ్లామర్, నటన కలిపి మరోసారి ఫ్యాన్స్ ని కట్టిపడేస్తుందనే నమ్మకం బలంగా ఉంది. ఇప్పుడు ఈ లుక్ తోనే బజ్ మరింత పెరిగిపోయింది.
