Begin typing your search above and press return to search.

వీడని డాక్యుమెంటరీ తిప్పలు.. మళ్లీ చిక్కుల్లో పడ్డ నయనతార!

లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార గత కొద్ది రోజులుగా నిత్యం వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   10 Sept 2025 9:19 PM IST
వీడని డాక్యుమెంటరీ తిప్పలు.. మళ్లీ చిక్కుల్లో పడ్డ నయనతార!
X

లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార గత కొద్ది రోజులుగా నిత్యం వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈమె పెళ్ళికి, సినిమా జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ ను ప్రముఖ బడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎప్పుడైతే రూపొందించిందో.. అప్పటి నుంచి ఈమెను ఎవరో ఒకరు టార్గెట్ చేస్తున్నారనే వార్తలు వినిపించడమే కాదు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా.. అసలు విషయంలోకి వెళ్తే.. వివాహం అనంతరం ఈమె జీవిత కథ ఆధారంగా గత ఏడాది "నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ " అనే ఒక డాక్యుమెంటరీని రూపొందించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.

ఇందులో గతంలో నయనతార నటించిన సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ను కొన్ని యాడ్ చేయడం వివాదంగా మారింది. అప్పట్లోనే ధనుష్ నిర్మాణంలో నయనతార నటించిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలోని కొన్ని క్లిప్స్ ను నయనతార పరిమిషన్ లేకుండా వాడారు అంటూ.. దీనికి నష్టపరిహారంగా.. కోటి రూపాయలు నష్టపరిహారం కోరుతూ కోర్టులో కేసు వేశారు కోలీవుడ్ స్టార్ ధనుష్. దీనిపై స్పందించిన నయనతార.. గతంలోనే పర్మిషన్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించినా..ధనుష్ స్పందించలేదని, అందుకే ఉపయోగించామంటూ క్లారిటీ ఇచ్చింది. అయినా సరే ధనుష్ ఈ కేసును వదలలేదు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది.

ఇక ఈ కేసు పూర్తికాకముందే ఇప్పుడు మరోసారి నయనతార చిక్కుల్లో పడింది. ఏబీ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ తమ పర్మిషన్ లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారు అని ఆరోపిస్తూ.. రూ.5కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. అసలు విషయంలోకి వెళితే.. నయనతార డాక్యుమెంటరీలో 'చంద్రముఖి' సినిమా క్లిప్స్ ను వాడారు అని, ఈ చిత్ర నిర్మాతలు ఏ బి ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ ద్వారా కోర్టును ఆశ్రయించారు. దీని కారణంగా ఇప్పుడు డాక్యుమెంటరీని నిర్మిస్తున్న టార్క్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ కూడా చిక్కుల్లో పడింది.

అంతేకాదు డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ ను కౌంటర్ పిటిషన్ వేయాలి అంటూ కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలి అని నయనతారకు నెట్ ఫ్లిక్స్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది . ఇలా ఒకదాని తర్వాత మరొకసారి వివాదాలలో చిక్కుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది నయనతార. నిజానికి ఆ సినిమాలలో చిన్న క్లిప్స్ పర్మిషన్ తో వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్మిషన్ లేకుండానే ఉపయోగించినట్లు.. అందుకే ఇప్పుడు ఐదు కోట్లు ఇవ్వాలి అని కోరుతూ కోర్టులో కేసు వేయడం సంచలనంగా మారింది. మరి దీనిపై నయనతార ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

నయనతార సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక మరొకవైపు మూకుత్తి అమ్మన్ 2 లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది