సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్.. దిల్ రాజు బిగ్ ప్లాన్
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 31 March 2026 4:52 PM ISTబాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 63వ సినిమాగా (SVC63) దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిన్ననే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాగా, అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన మరో భారీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ బయటపెట్టింది. ఈ క్రేజీ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు మేకర్స్ తెరదించారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో కొత్త రకం కథల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి లాంటి కమర్షియల్ దర్శకుడు సల్మాన్ ఖాన్ స్టార్ ఇమేజ్‌ను ఎలా వాడుకుంటారనే చర్చ జరుగుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, సినిమాలో ఫీమేల్ లీడ్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉందని సమాచారం. అందుకే ఈ పాత్ర కోసం ఏరికోరి ఒక పాపులర్ స్టార్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నారు.
నయనతార ఇప్పటికే షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. వంశీ పైడిపల్లి తన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చాలా హుందాగా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తారనే పేరుంది. అందుకే నయనతార లాంటి టాలెంటెడ్ నటి ఈ ప్రాజెక్టులోకి రావడం సినిమాకు పెద్ద బలం అని చెప్పొచ్చు. సల్మాన్ నయన్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ అప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది ఒక కంప్లీట్ మాస్ డ్రామా ప్యాకేజీలా ఉండబోతోందని, విజువల్స్ పరంగా కూడా దిల్ రాజు ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నేషనల్ అవార్డు గ్రహీత అయిన వంశీ పైడిపల్లి, సల్మాన్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం, నయనతార రాకతో ఈ సినిమాకు సౌత్ మార్కెట్‌లో కూడా మరింత క్రేజ్ రావడం ఖాయం. ఒక తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు కలిసి బాలీవుడ్ టాప్ స్టార్‌ను హ్యాండిల్ చేయడం స్పెషల్. దిల్ రాజు తన మార్క్ మేకింగ్‌తో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. నటీనటుల ఎంపికలోనే ఇంతటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే, కథ విషయంలో కూడా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సల్మాన్ నయనతార కాంబినేషన్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది చేసింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.
