'నాకు అస్సలు వద్దు!'.. ట్యాగ్ పూర్తిగా తీసేసిన స్టార్ హీరోయిన్
అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి ఫేమ్ తో పాటు సాలిడ్ మార్కెట్ ను సంపాదించుకున్న వారిలో కోలీవుడ్ హీరోయిన్ నయనతార కూడా ఒకరన్న విషయం తెలిసిందే
By: M Prashanth | 16 Aug 2025 2:00 PM ISTసౌత్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి ఫేమ్ తో పాటు సాలిడ్ మార్కెట్ ను సంపాదించుకున్న వారిలో కోలీవుడ్ హీరోయిన్ నయనతార కూడా ఒకరన్న విషయం తెలిసిందే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్స్ సొంతం చేసుకున్న ఆమె.. ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు.
అయితే రజినీకాంత్ ను కోలీవుడ్ సూపర్ స్టార్ అని అంతా పిలుస్తుండగా.. నయన్ ను లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునేవారు. కానీ కొన్ని నెలల క్రితం నయనతార ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తనకు ఆ ట్యాగ్ వద్దు అనుకుంటున్నట్లుగా నోట్ లో చెప్పుకొచ్చారు. తనను నయనతార మాత్రమే అనాలని చెప్పారు.
అభిమానులు, మీడియా ప్రతినిధులు, సినీ ప్రియులు అంతా నయనతార అనే పిలవాలని కోరారు. దీంతో అప్పట్లో ఆమె నిర్ణయంతో వైరల్ గా మారారు. సోషల్ మీడియాలో అన్ని వర్గాల ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు. అయితే ఇప్పుడు ఆ విషయం మళ్ళీ నెట్టింట వైరల్ గా మారింది. పేరు ముందు ట్యాగ్ పూర్తిగా తీసుకున్నారు నయన్.
నయన్ అప్ కమింగ్ మూవీస్ లో డియర్ స్టూడెంట్స్ కూడా ఒకటి. మలయాళ కథానాయకుడు నివిన్ పౌలీ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. లవ్ యాక్షన్ డ్రామా చిత్రం తర్వాత నయన, నివిన్ ఇప్పుడు మరోసారి జతకడుతున్నారు. అప్పుడు మంచి హిట్ అందుకోగా.. ఇప్పుడు కామెడీ డ్రామా డియర్ స్టూడెంట్స్ పై కూడా సూపర్ బజ్ నెలకొంది.
రీసెంట్ గా మేకర్స్ ఆ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. అందులో టైటిల్ కార్డ్స్ లో నయన్ తార పేరుపై అందరూ ఫోకస్ చేశారు. చూడీదార్ డ్రెస్ లో ఉన్న హీరోయిన్ ను పరిచయం చేస్తూ.. నయనతార అనే వేశారు మేకర్స్. దీంతో ఇప్పటికే ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసిన నయనతార అందుకు తగ్గట్లే ఫాలో అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
డిసెషన్ తీసుకోవడమే కాదని.. ఫాలో అవ్వడం చాలా ముఖ్యమని కొందరు చెబుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్ గా నయనతార ట్యాగ్ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనిబట్టి చూస్తే నయన్ అప్ కమింగ్ అన్ని చిత్రాల్లో ఆమె పేరు ముందు ఇకపై ఎలాంటి ట్యాగ్ ఉండదని డియర్ స్టూడెంట్స్ మూవీ టీజర్ తో అందరికీ క్లారిటీ వచ్చేసినట్లే.
