Begin typing your search above and press return to search.

నయనతార బ్యాడ్ టైం ఇంతగానా..?

నయనతారకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. అది ఎంతగా అంటే ఒక రేంజ్ లో అన్నమాట.

By:  Ramesh Boddu   |   13 Sept 2025 10:00 PM IST
నయనతార బ్యాడ్ టైం ఇంతగానా..?
X

నయనతారకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. అది ఎంతగా అంటే ఒక రేంజ్ లో అన్నమాట. నయనతార పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ కి నయనతార బియాండ్ ద ఫైరీ టేల్ అని రిలీజ్ చేశారు. అందులో ఆల్రెడీ ధనుష్ ప్రొడక్షన్ క్లిప్ ని పర్మిషన్ లేకుండా వాడుకున్నారని ధన్ష్ ఆ డాక్యుమెంటరీ పై కోర్ట్ కేసు వేశాడు. దానికి ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు మరో కేస్ నయనతార మెడకు చుట్టుకుంటుంది. ఇదే డాక్యుమెంటరీలో ఛంద్రముఖి క్లిప్స్ ని వాడినందుకు గాను ఆ సినిమా ప్రొడక్షన్ ఏబి ఇంటర్నేషనల్ వాళ్లు మరో కేసు వేశారు.

ఛంద్రముఖి మేకర్స్ నుంచి షాక్..

నయనతార డాక్యుమెంటరీలో తమ కిప్స్ వాడినందుకు వాళ్లు కూడా కేసు ఫైల్ చేశారు. AB ఇంటర్నేషనల్ 2005 లో ఛంద్రముఖి సినిమా నిర్మించింది. ఐతే నయనతార ఇప్పటికే ధనుష్ కేసు విషయంలోనే చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఛంద్రముఖి మేకర్స్ నుంచి షాక్ తగిలింది. తమ పర్మిషన్ లేకుండా ఛంద్రముఖి క్లిప్స్ వాడినందుకు నయనతార నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు ఏబి ఇంటర్నేషనల్ మేకర్స్.

ఐతే ఈ విషయంలో ఏబి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో నయనతార టీం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. బయట సెటిల్ చేసుకుని మ్యాటర్ క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. నయనతార నెట్ ఫ్లిక్స్ లో తన డాక్యుమెంట్ ని భారీ ధరకు అమ్ముడవగా ఆమెకు ఇలా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఐతే ధనుష్ తో ఈ కేసు విషయం జరుగుతున్న టైం లో నయనతార తన సోషల్ మీడియాలో తను వాడుకున్న క్లిప్స్ గురించి తను నటించిన కొన్ని ప్రొడక్షన్ సంస్థల నుంచి పర్మిషన్ తీసుకున్నా అని ఒక లిస్ట్ బయట పెట్టింది.

కెరీర్ లో దూకుడు తగ్గించిన నయనతార..

ఐతే ఛంద్రముఖి ప్రొడ్యూసర్స్ ఆ డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యాక ఇప్పుడు మేల్కోవడం ఏంటో అర్ధం కావట్లేదు. ఏది ఏమైనా నయనతార ఆ డాక్యుమెంటరీ వల్ల పొందిందేమో కానీ ఇలా కోర్టులు కేసులు అంటూ నానా ఇబ్బందులు పడుతుంది. ఓ పక్క కెరీర్ లో కూడా కాస్త దూకుడు తగ్గినట్టే అనిపిస్తుంది. మరి నయనతార ఈ ఫేజ్ ని ఎలా దాటుతుంది అన్నది చూడాలి. ధనుష్ వ్యవహారంలో ఇటు నయన్ అటు ధనుష్ ఇద్దరు తగ్గట్లేదు. మరి కోర్టు ఇష్యూకి నయనతార ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది అన్నది చూడాలి. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్న అమ్మడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ లో నటిస్తుంది.