పిల్లల పెంపకం ఒక వైపు.. కెరీర్ జోరు మరోవైపు
ఇండియాలో సొంతంగా ఒక ప్రయివేట్ జెట్ ని మెయింటెయిన్ చేస్తున్న మేటి నటిగా నయనతార పేరు మార్మోగింది. నయనతార నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లు.
By: Sivaji Kontham | 29 Sept 2025 11:50 PM ISTఓవైపు పిల్లల్ని పెంచాలి.. భర్తతో సంసారం ఈదాలి.. మరోవైపు కెరీర్ చాలా ముఖ్యం. పిల్లల పెంపకం, నటనారంగం.. రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ, ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదుగుతూ, అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళగా పేరు తెచ్చుకున్నారు నయనతార. తలైవిగా గుర్తింపు పొందిన నయన్ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు మామ్ గా బాధ్యతలు నిర్వర్తించడం నిజంగా సవాల్ తో కూడుకున్నది.
నయనతార- విఘ్నేష్ శివన్ సరోగసీ ద్వారా తమ పిల్లలను స్వాగతించారు. ఉయిర్ - ఉలగ్ అనే ఆసక్తికర పేర్లు పెట్టారు. ఈ జంట 9 జూన్ 2022న వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆదర్శ జంటగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా నయన్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నా విఘ్నేష్ నుంచి కావాల్సిన సహకారం అందుతోంది. ఇద్దరూ పిల్లల్ని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పెంచడం ప్రతిసారీ సోషల్ మీడియాల్లో మనసులు గెలుచుకుంటోంది.
తమిళం, తెలుగు, మలయాళంలో పవర్ ఫుల్ పాత్రలలో నటించిన నయనతార భారతీయ వినోదరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, నాయికా ప్రధాన చిత్రాల్లో నటించడం నయన్ ప్రత్యేకత. మరోవైపు జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్. ఇందులో దిగ్గజ నటీమణులు ఉన్నా నయనతార తన ప్రత్యేకతను నిలుపుకున్నారు.
100 కోట్ల ఆస్తిపరురాలు:
ఇండియాలో సొంతంగా ఒక ప్రయివేట్ జెట్ ని మెయింటెయిన్ చేస్తున్న మేటి నటిగా నయనతార పేరు మార్మోగింది. నయనతార నికర ఆస్తుల విలువ సుమారు 100 కోట్లు. ఒక్కో సినిమాకి 5-8 కోట్ల పారితోషికం అందుకుంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తూ 18ఏళ్ల ప్రయాణంలో ఈ స్థాయిని అందుకుంది. 2018 లో మొత్తం రూ .15 కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న నయన్ గత 17 ఏళ్లలో 75 కి పైగా చిత్రాల్లో నటించింది. 2003 లో మనస్సినక్కరే తో మలయాళ సినీరంగానికి పరిచయమైంది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ అగ్ర నాయికగా ఎదిగింది. నయనతార కన్నడలో `సూపర్` సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇది ఏకైక శాండల్ వుడ్ చిత్రం. ఇక టాలీవుడ్ లో అందరు అగ్ర హీరోల సరసన నయనతార భారీ బ్లాక్ బస్టర్లలో నటించింది.
నయనతార తన స్వగ్రామమైన కేరళలో ఒక సొంత ఇల్లు ఉంది. చెన్నైలో ఖరీదైన అపార్ట్ మెంట్ ను నయన్ కొనుగోలు చేసింది. ఖరీదైన బీఎండబ్ల్యూ X5 యజమాని.. ఈ స్వాంకీ కార్ ధర 75.21 లక్షలు. నయనతారకు ఆడి క్యూ 7 కూడా ఉంది. ఈ రోడ్ రేంజర్ అంచనా వ్యయం సుమారు రూ .80 లక్షలు.
