Begin typing your search above and press return to search.

బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ ల‌తో ఆ బ్యూటీ!

స‌క్సెస్ ఒక్కోసారి ఆల‌స్యం కావొచ్చు. కానీ సాలిడ్ స‌క్సెస్ అందుకుంటే? కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్నింగ్ తిరిగిపోతుంది. ఇక్క‌డ ఆవ‌గింజంత అదృష్టం కూడా క‌లిసి రావాలండోయ్.

By:  Srikanth Kontham   |   27 Dec 2025 7:00 AM IST
బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ ల‌తో  ఆ బ్యూటీ!
X

స‌క్సెస్ ఒక్కోసారి ఆల‌స్యం కావొచ్చు. కానీ సాలిడ్ స‌క్సెస్ అందుకుంటే? కెరీర్ ఒక్క‌సారిగా ట‌ర్నింగ్ తిరిగిపోతుంది. ఇక్క‌డ ఆవ‌గింజంత అదృష్టం కూడా క‌లిసి రావాలండోయ్. తెలుగు అమ్మాయి న‌య‌న్ సారిక జ‌ర్నీ అలాగే క‌ని పిస్తుంది. `గ‌మ్ గ‌మ్ గ‌ణేషా`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీకి ఆ సినిమా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. అదే ఏడాది రిలీజ్ అయిన `ఆయ్` తో మాత్రం మంచి స‌క్సెస్ అందుకుంది. యూత్ పుల్ స్టోరీతో అమ్మ‌డు యువ‌త‌కు బాగానే క‌నెక్ట్ అయింది. ఆ సినిమా స‌క్స‌స్ అనంత‌రం `క‌` తో ఏకంగా బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాతాలో వేసుకుంది.

ఇందులో హీరో కిరణ్ అబ్బవరంకి జోడీగా సత్యభామ అనే పల్లెటూరి యువతి పాత్రలో ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. లవ్ సీన్స్ లో హీరోతో కెమిస్ట్రీ చ‌క్క‌గా వ‌ర్కౌట్ చేసింది. లుక్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్, డ్యాన్స్ అన్ని ప‌ర్పెక్ట్ గా కుదిరాయి. ఆ త‌ర్వాత `బెంచ్ లైఫ్` అనే మ‌రో సినిమా చేసింది. కానీ ఈ సినిమా మాత్రం ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలియ‌దు. ఇవ‌న్నీ 2024లో రిలీజ్ అయిన చిత్రాలు. 2025లో మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేదు. కానీ 2026 లో మాత్రం రెండు సంవ‌త్స‌రాల‌కు త‌గ్గ ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందించే కాన్పిడెన్స్ తో దిగుతుంది.

ప్ర‌స్తుతం శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తోన్న `విష్ణు విన్యాసం`లో న‌టిస్తోంది. సెట్స్ లో ఉందీ చిత్రం. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే మ‌రో యువ హీరో సంగీత్ శోభ‌న్ హీరోగా న‌టిస్తోన్న మ‌రో చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆన్ సెట్స్ లో ఉన్న సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. క‌న్న‌డ న‌టుడు గోల్డెన్ స్టార్ గ‌ణేష్ హీరోగా న‌టిస్తోన్న‌ చిత్రంలోనూ న‌య‌న్ సారిక నాయిక‌గా ఎంపికైంది. `పినాక` టైటిల్ తో రూపొందుతున్న చిత్ర‌మిది.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అనంత‌రం ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయితే గ‌నుక సారిక ఇమేజ్ పాన్ ఇండియాకు రీచ్ అవుతుంది. ఈ చిత్రాన్ని పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఇవ‌న్నీ 2026లో రిలీజ్ అయ్యే ప్రాజెక్టులే. ఇవిగాక మ‌రికొన్ని ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది. కానీ వాటి వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉంచింది. ఎంతో మంది తెలుగు అమ్మాయిలున్నా? వాళ్లెవ్వ‌రికీ రాని అవ‌కాశాలు న‌య‌న్ అందుకోవ‌డంలో ల‌క్కీ గాళ్ అనే మరోసారి ప్రూవ్ అయింది.