Begin typing your search above and press return to search.

ట్రాక్టర్ బిజినెస్ లోకి మెగాస్టార్ మనవరాలు.. అసలు కారణం ఇదే అంటూ!

విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ ప్రముఖ బిజినెస్ నిఖిల్ నందను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   30 Oct 2025 3:14 PM IST
ట్రాక్టర్ బిజినెస్ లోకి మెగాస్టార్ మనవరాలు.. అసలు కారణం ఇదే అంటూ!
X

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలకు సంబంధించిన వారసులు దాదాపుగా సినిమా రంగంలోనే కొనసాగుతారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మెగాస్టార్ మనవరాలు మాత్రం ఏకంగా సినిమా ఇండస్ట్రీని కాదని ట్రాక్టర్ బిజినెస్ మొదలుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తాను సినిమాల్లోకి కాకుండా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టడం వెనుక అసలు కారణం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే మెగాస్టార్ అనగానే ప్రతి ఒక్కరికి చిరంజీవి గుర్తుకొస్తారు.. కానీ ఇక్కడ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు ఇండస్ట్రీకి రాకుండా బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేసింది.

విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ ప్రముఖ బిజినెస్ నిఖిల్ నందను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంటకు ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. వీరి కూతురు నవ్యా నవేలి అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అమితాబ్ బచ్చన్ కూడా పలుమార్లు నవ్యతో దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా.. అంతేకాదు పారిస్ లోరెల్ ఫ్యాషన్ వాక్ లో పాల్గొన్న ఈమె.. దానికి అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. అందానికి తగ్గ అందం.. అభినయం ఉన్న ఈమెకు అప్పట్లోనే హీరోయిన్గా అవకాశాలు లభించాయి. ముఖ్యంగా సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను దక్కించుకుంటుంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేశారు.

అయితే ఇప్పుడు సడన్ గా బాలీవుడ్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించింది ఈ ముద్దుగుమ్మ.. నవ్యా తండ్రి, తాతలు అగ్రికల్చర్ పరికరాలు తయారు చేసే బిజినెస్ చేస్తున్నారు. ముఖ్యంగా Escorts Kubota limited అనే కంపెనీ ను వీళ్లు నడిపిస్తున్నారు. ఫార్మా ట్రాక్టర్స్ అనే ట్రాక్టర్ బిజినెస్ కూడా ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి తన తండ్రి తాతల లెగసీని ముందుకు తీసుకువెళ్లాలని నవ్యా నవేలీ నిర్ణయించుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవ్య నవేలి మాట్లాడుతూ.." మా నాన్న, మా తాతలు బిజినెస్ రంగంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో అగ్రికల్చర్ పరికరాల గురించి, ట్రాక్టర్ల గురించి వింటూ పెరిగాను. ఒక ట్రాక్టర్ మొత్తాన్ని నేను విప్పి బిగించగలను కూడా.. అంతలా నాకు ట్రాక్టర్స్ గురించి అనుభవం ఉంది. అందుకే మా నాన్న తాతయ్యల లెగసీని బిజినెస్ లో ముందుకు తీసుకువెళ్లాలని ఈ పైపు వచ్చాను. బిజినెస్ రంగంలోనే కాదు ఇటు అన్ని రంగాలలో కూడా ఉంటాను.. ముఖ్యంగా నాకు బాలీవుడ్ అంటే చాలా గౌరవం.. కానీ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను" అంటూ తెలిపింది.

నవ్య నవ్వేలి విషయానికి వస్తే.. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈమె జెండర్ ఈక్వాలిటీ కోసం పనిచేస్తోంది. ఐఐఎం అహ్మదాబాద్ లో బిజినెస్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. తమ కంపెనీలో మూడేళ్లు ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా తండ్రి, తాత లాగే అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేయాలని, బిజినెస్ లో ఎదగాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే బిజినెస్ లో పలు అవార్డులు కూడా అందుకున్న ఈమె తన తండ్రి కంపెనీలో 0.02% స్టాక్స్ కూడా ఉన్నాయి. దీని విలువ సుమారుగా ఏడు కోట్లని సమాచారం.