Begin typing your search above and press return to search.

నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ ఎవరితో..?

అనగనగా ఒక రాజుకి లేట్ తనకు యాక్సిడెంట్ వల్ల అతని తెలిసిందే. ఐతే ఇక మీదట అయినా నవీన్ ఏడాదికి ఒకటి కుదిరితే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని చెప్పొచ్చు.

By:  Ramesh Boddu   |   29 Jan 2026 12:24 PM IST
నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ ఎవరితో..?
X

యువ హీరోల్లో తన టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. రీసెంట్ గా సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో వచ్చి మరోసారి తన సత్తా చాటాడు. సంక్రాంతి సినిమా అంటే ఎలా ఉండాలో అలా కథ రొటీన్ గా అనిపించినా మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ కథనాలతో అనగనగా ఒక రాజు రేసులో సక్సెస్ ఫుల్ గా నిలిచింది. ఐతే అనగనగా ఒక రాజు కోసం 2 ఏళ్లు టైం తీసుకున్న నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడన్న డిస్కషన్ మొదలైంది.

నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ వర్తీ..

నవీన్ పొలిశెట్టి సినిమాల్లో విషయం ఉంటుంది. అతను రెండేళ్లకు ఒకసారి సినిమా చేసినా సరే టికెట్ వర్తీ అనిపించేలా ఇంప్రెస్ చేస్తాడు. ఐతే నిజంగానే అతను తీసే సినిమా కోట్ల బడ్జెట్ పాన్ ఇండియా రిలీజ్ అయితే 2, 3 ఏళ్లకు ఒకటి తీసినా పని అవుద్ది. కానీ సింపుల్ కథలకే తను అంత టైం తీసుకోవడం వల్ల రేసులో మరికొంతమంది ముందుకు వెళ్తారు. ఈ విషయాన్ని కచ్చితంగా నవీన్ పొలిశెట్టి గుర్తించాల్సిందే.

అనగనగా ఒక రాజుకి లేట్ తనకు యాక్సిడెంట్ వల్ల అతని తెలిసిందే. ఐతే ఇక మీదట అయినా నవీన్ ఏడాదికి ఒకటి కుదిరితే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని చెప్పొచ్చు. నవీన్ ఒక మంచి ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశాడు. అతని సినిమా అయితే పక్కా చూడొచ్చు అనే నమ్మకం కలిగించాడు.

నవీన్ సినిమాల విషయంలో వేగం పెంచాల్సిన అవసరం..

ఐతే ఈ టైంలోనే మంచి కథలతో కాస్త వర్క్ స్పీడ్ అప్ చేస్తేనే నవీన్ కి వరుస సినిమాలు పడే ఛాన్స్ ఉంటుంది. నవీన్ సినిమా కథల విషయంలో తన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. అందుకే స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే వీటితో తను ఆఫ్ స్క్రీన్ చాలా టైం తీసుకుంటున్నాడు. ఐతే అనుదీప్ లాంటి డైరెక్టర్ తో మాత్రం అనుదీప్ కేవలం తన పని తాను చేసుకున్నాడు.

అనగనగా ఒక రాజు ప్రాజెక్ట్ ఒక డైరెక్టర్ మధ్యలో నుంచి టేకప్ చేశాడు కాబట్టి నవీన్ అలా చేశాడు కానీ నెక్స్ట్ సినిమా మాత్రం కథ ఓకే చేశాక తన డ్యూటీ తను చేసుకునే ఛాన్స్ ఉంది. ఐతే నవీన్ సినిమాల విషయంలో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. అనగనగా ఒక రాజు తో సక్సెస్ కొట్టిన అతను ఈ ఇయర్ మరో సినిమా తీసుకొచ్చే ప్లాన్ చేస్తే బాగుంటుందని నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అది ఎవరితో ఎలా సెట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఐతే క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకునే పనిలోనే చర్చలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నవీన్ తో సినిమా అంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా రెడీ అనేస్తున్నారు.