Begin typing your search above and press return to search.

'అనగనగా ఒక రాజు' టికెట్ రేట్ల పెంపు.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ!

రేట్ల పెంపు గురించి మరింత వివరిస్తూ.. సింగిల్ స్క్రీన్స్‌కు కేవలం 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లకు ఆంధ్రప్రదేశ్‌లో 75 రూపాయలు మాత్రమే పెంచామని నాగవంశీ తెలిపారు.

By:  M Prashanth   |   14 Jan 2026 11:54 AM IST
అనగనగా ఒక రాజు టికెట్ రేట్ల పెంపు.. క్లారిటీ ఇచ్చిన నాగవంశీ!
X

సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' కలెక్షన్ల సునామీ సృష్టిస్తుండగా, ప్రభాస్ 'రాజా సాబ్' కూడా తన పట్టును చాటుకుంటోంది. ఇక మాస్ రాజా రవితేజ కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేశాడు. ఇక ఈ భారీ చిత్రాల మధ్య యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' నేడు గ్రాండ్‌గా విడుదలైంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వచ్చింది. నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీతో పాటు మీనాక్షి చౌదరి గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో సోషల్ మీడియాలో కొంత చర్చ నడిచింది. మీడియం బడ్జెట్ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు ప్రశ్నలు కురిపించారు.

ఈ అంశంపై నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి సీజన్‌లో ఒకేసారి ఐదు సినిమాలు థియేటర్లలో ఉన్నాయని, ముఖ్యంగా ప్రభాస్, చిరంజీవి గారి సినిమాల వల్ల థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఆయన వివరించారు. తక్కువ థియేటర్లు ఉన్నప్పుడు ఆ నాలుగు ఐదు రోజులు అడ్వాంటేజ్ తీసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

రేట్ల పెంపు గురించి మరింత వివరిస్తూ.. సింగిల్ స్క్రీన్స్‌కు కేవలం 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లకు ఆంధ్రప్రదేశ్‌లో 75 రూపాయలు మాత్రమే పెంచామని నాగవంశీ తెలిపారు. ఇది మరీ భారమయ్యే రేటు కాదని, పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ అందరూ చర్చించుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే ఈ రేట్లు అమలులో ఉంటాయని ఓ క్లారిటీ అయితే ఇచ్చారు.

నిజానికి 'అనగనగా ఒక రాజు' వంటి కామెడీ చిత్రాలకు పండుగ సీజన్ పెద్ద ప్లస్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి ఎనర్జీకి తోడు, నాగవంశీ నిర్మాణ విలువలు తోడవ్వడంతో సినిమాపై మంచి బజ్ ఉంది. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని, ఈ చిన్నపాటి రేట్ల పెంపు వసూళ్లకు హెల్ప్ అవుతుందని నిర్మాత నమ్మకంగా ఉన్నారు.

మరోవైపు 'MSG' 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేయగా, 'అనగనగా ఒక రాజు' ఆ రన్ లో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి. 2 గంటల 20 నిమిషాల నిడివితో వస్తున్న ఈ పెళ్లి నేపథ్యం గల కథ యూత్ తో పాటు ఫ్యామిలీలకు కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలే నవీన్ చాలా రోజుల తరువాత ఆడియేన్స్ ముందుకు వచ్చాడు. మౌత్ టాక్ బాగుంటే స్క్రీన్ కౌంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది.