Begin typing your search above and press return to search.

పోలిశెట్టి ట్రెండ్ అవ్వడానికి కారణమిదేనా?

టాలివుడ్ లో తనదైన కామెడీ టైమింగ్‌, నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.

By:  M Prashanth   |   10 March 2026 1:39 PM IST
పోలిశెట్టి ట్రెండ్ అవ్వడానికి కారణమిదేనా?
X

టాలివుడ్ లో తనదైన కామెడీ టైమింగ్‌, నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. తక్కువ సినిమాలతోనే ఎక్కువ ఎఫెక్ట్ చూపించే హీరోగా పేరు తెచ్చుకున్నారు. కొత్త కథలు, విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి సినిమా ద్వారా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో క్రైమ్ కామెడీ జానర్‌ కు కొత్త ఊపు తీసుకొచ్చారు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్, టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత విడుదలైన జాతిరత్నాలు సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించారు. అనంతరం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో క్లాస్‌, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా అలరించారు.

ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన అనగనగా ఒక రాజు సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఇందులో గోదావరి ప్రాంత యువకుడిగా ఆయన చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా వరుసగా భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నవీన్ పోలిశెట్టి తదుపరి ప్రాజెక్టులపై కూడా ఆసక్తి నెలకొంది.

అయితే కొన్నిరోజులుగా నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో ఉంటున్నారు. అయితే ఈసారి ఆయన సినిమాల వల్ల కాదు.. టాలీవుడ్‌ లో హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుక కారణంగా నవీన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేర్ అవుతున్నాయి.

విరోష్ పెళ్లి వేడుకలో నవీన్ పోలిశెట్టి సందడి ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ప్రత్యేకమైన అవుట్‌ ఫిట్‌ లో వచ్చిన ఆయన ఈవెంట్‌ కు వచ్చిన గెస్టులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. పలువురు సినీ తారలతో కలిసి ఫోటోలు దిగుతూ, నవ్వుతూ, హగ్స్ ఇస్తూ, అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ ఫన్ మూమెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

అంతేకాకుండా నెట్టింట తరచూ ట్రెండింగ్‌ లో ఉండే స్టార్ కిడ్ అల్లు అయాన్ తో నవీన్ చేసిన కామెడీ అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఇలాంటి వీడియోలు, ఫోటోలు మీడియా ద్వారా బయటకు వస్తాయని చాలా మంది భావిస్తారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నవీన్ పోలిశెట్టికి ప్రత్యేకంగా పర్సనల్ ఫోటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్ ఉంటారట.

ఆయన ఎక్కడికి వెళ్లినా వారు వెంటనే వెళ్లి అక్కడి ఫన్ మూమెంట్స్‌ ను చిత్రీకరిస్తారని టాక్ వినిపిస్తోంది. తర్వాత ఆ వీడియోలు, ఫోటోలు పీఆర్ టీమ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అంటున్నారు. అందువల్ల నవీన్ పోలిశెట్టి మూమెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అందుకే ఆయన తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో కనిపిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.