Begin typing your search above and press return to search.

ఆ మూడింటిలో న‌వీన్ పొలిశెట్టి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్!

స్టార్ హీరోల‌కు త‌మ‌కిచ్చిన క్యారెక్ట‌ర్‌ని ర‌క్తిక‌ట్టించాలంటే ప్ర‌ధానంగా ఉండాల్సింది భాష‌.యాస మీద ప‌ట్టు.

By:  Tupaki Entertainment Desk   |   17 Jan 2026 5:33 PM IST
ఆ మూడింటిలో న‌వీన్ పొలిశెట్టి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్!
X

స్టార్ హీరోల‌కు త‌మ‌కిచ్చిన క్యారెక్ట‌ర్‌ని ర‌క్తిక‌ట్టించాలంటే ప్ర‌ధానంగా ఉండాల్సింది భాష‌.యాస మీద ప‌ట్టు. అది ఉంటేనే క్యారెక్ట్‌కు హండ్రెడ్ ప‌ర్సంట్ న్యాయం చేయ‌గ‌లుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు యాస‌లు ప్ర‌ధానం. ఆంధ్రా, రాయ‌ల‌సీమ‌, తెలంగాణ‌. ఈ మూడు ప్రాంతాల యాస‌ల‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా ప‌ల‌క‌గ‌లిగే స్టార్లు మ‌న టాలీవుడ్‌లో చాలా త‌క్కువ అని చెప్పొచ్చు. మెగాస్టార్ తాను చేసిన కొన్ని సినిమాల్లోని ఒక‌టి రెండు సీన్‌ల‌లో మాత్ర‌మే రెండు, మూడు స్లాంగ్‌ల‌ని వాడారే కానీ పూర్తి స్థాయిలో ఒక్కో స్లాంగ్‌కి ఒక్కో సినిమా మాత్రం చేయ‌లేదు.

అయితే నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి హీరోలు మాత్రం మూడు ప్రాంతాల‌కు సంబంధించిన స్లాంగ్‌ల‌తో సినిమాలు చేశారు. ఔరా అనిపించారు. యంగ్ హీరోల్లో కొంత మంది ట్రై చేస్తున్నా ఎవ‌రూ ప‌ర్‌ఫెక్ట్‌గా మాత్రం మూడు స్లాంగ్‌ల‌ని పూర్తి స్థాయిలో త‌మ సినిమాల్లో చూపించ‌లేక‌పోయారు. అయితే ఈ ఫీట్‌ని పూర్తి చేసి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి. త‌ను హీరోగా ప‌రిచ‌య‌మైన మూవీ `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`. బ్లాక్ కామెడీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో నెల్లూరు స్లాంగ్‌తో సాగే క్యారెక్ట‌ర్‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు న‌వీన్.

ఈ మూవీ సూప‌ర్ హిట్‌గా నిలిచి న‌వీన్ పొలిశెట్టికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని త‌రువాత న‌వీన్ చేసిన కామెడీ డ్రామా `జాతిర‌త్నాలు`. నాగ్ అశ్విన్ నిర్మించ‌గా, అనుదీప్ కె.వి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించి రూ.70 కోట్లు రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురి చేసింది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి జోగీపేట్ శ్రీ‌కాంత్ అనే తెలంగాణ యువ‌కుడిగా న‌టించాడు. ఇందులో ప‌క్కా తెలంగాణ స్లాంగ్‌లో నవీన్ చెప్పిన డైలాగ్‌లు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్. తెలంగాణ స్లాంగ్‌తోనూ `జాతిర‌త్నాలు`తో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ సంక్రాంతికి న‌వీన్ పొలిశెట్టి చేసిన మూవీ `అన‌గ‌న‌గా ఒక రాజు`. మారి డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో నిలిచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప‌క్కా గోదావ‌రి స్లాంగ్‌లో సాగే క్యారెక్ట‌ర్‌లో రాజుగా క‌నిపించి న‌వీన్ పొలిశెట్టి ఆక‌ట్టుకున్నాడు. జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ సినిమా మూడు రోజుల‌కు గానూ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.61 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స్టిల్ అదే జోష్‌తో కంటిన్యూ అవుతోంది. ఈ మూవీతో మూడ‌వ స్లాంగ్‌లో న‌వీన్ పొలిశెట్టి చేసిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ కావ‌డంతో న‌వీన్ రేర్ ఫీట్‌ని సొంతం చేసుకోవ‌డం విశేషం.

మూడు భిన్న‌మైన స్లాంగ్‌ల‌ని అంతే ప‌ర్‌ఫెక్ట్‌గా త‌న సినిమాల్లో ప‌లికి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డ‌మే కాకుండా ఆయా స్లాంగ్‌లో సాగే క్యారెక్ట‌ర్ల‌తో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌లుగా నిల‌వ‌డంతో న‌వీన్ పొలిశెట్టిని అంతా మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటున్నారు. `అన‌గ‌న‌గా ఒక రాజు` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో న‌వీన్ పొలిశెట్టి ఒకేసారి మూడు స్లాంగ్‌ల‌ని ప‌లికి ఆశ్చ‌ర్య‌పరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.