అనగనగా ఒకరాజు ట్రైలర్.. పండగ లాంటి జోష్..!
నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మారి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు.
By: Ramesh Boddu | 8 Jan 2026 1:24 PM ISTనవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మారి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్ ఇంకా సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనగనగా ఒక రాజు ట్రైలర్ చూస్తే ఇది పక్కా పండగ వైబ్ ని మరింత పెంచే సినిమా అనిపిస్తుంది.
విలేజ్ సెటప్ లో మంచి ఎంటర్టైనింగ్ కథతో..
నచ్చిన అమ్మాయి కోసం మన రాజు పడే పాట్లు.. అతని పెళ్లి ఎలా జరగాలో ఛాలెంజ్ చేసి మరీ చేయించే ఏర్పాట్లు. రాజు పెళ్లికి అడ్డు పడే ఒక విలన్ ఇలా విలేజ్ సెటప్ లో ఒక మంచి ఎంటర్టైనింగ్ కథతో ఫుల్ ఫన్ తో పాటు ఎమోషన్ కూడా వర్క్ అవుట్ అయ్యేలా ఈ ట్రైలర్ ఉంది. ఆడియన్స్ బాగా తెలిసిన నవీన్ పొలిశెట్టి ఈ సినిమా విషయంలో అన్నీ తానై చూసుకున్నాడు.
ట్రైలర్ లో అతని లుక్స్, టైమింగ్, ఫన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక మీనాక్షి కూడా చాలా అందంగా కనిపించింది. సినిమాలో ఆమెది కూడా చాలా బలమైన రోల్ అనిపిస్తుంది. అనగనగా ఒక రాజు సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి ఫుల్ జోష్ అందించింది. ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేసేలా అనిపిస్తుంది.
జాతి రత్నాలు తో సూపర్ హిట్..
ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అవుతుండగా ఏ సినిమాకు ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తున్నాయి. ఐతే అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కథలతోనే వస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి ఆల్రెడీ జాతి రత్నాలు తో సూపర్ హిట్ అందుకున్నాడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా ఇంప్రెస్ చేసింది. మొత్తానికి తన మార్క్ ఎంటర్టైనింగ్ కథతో నవీన్ ఈ సంక్రాంతికి ఫెస్టివల్ వైబ్ ని డబల్ చేసేలా ఉన్నాడు.
అనగనగా ఒక రాజు ట్రైలర్ అదుర్స్ అనిపించింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటుంది అన్నది చూడాలి. నవీన్ పొలిశెట్టి నుంచి సినిమా అంటే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. తన సినిమాలతో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్ తో కూడా నవీన్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. అనగనగా ఒక రాజు సినిమా విషయంలో స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా షూటింగ్ ఆఫ్టర్ దట్ ప్రమోషన్స్ అన్నీ కూడా సింగిల్ హ్యాండిల్ గా మెయిన్ టైన్ చేశాడు నవీన్ పొలిశెట్టి. సినిమా సక్సెస్ అయితే ఫుల్ క్రెడిట్ తనకే దక్కుతుందని చెప్పొచ్చు.
