Begin typing your search above and press return to search.

సినిమాను హిట్ చేస్తే టీమ్ కొంటా.. టీమ్ పేరేంటంటే?

అందులో భాగంగానే రీసెంట్ గా చిత్ర యూనిట్ పోలిశెట్టి మీట్స్ పికిల్ బాల్ అనే ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా, ఆ ఈవెంట్ కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Dec 2025 3:20 PM IST
సినిమాను హిట్ చేస్తే టీమ్ కొంటా.. టీమ్ పేరేంటంటే?
X

టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోల్లో న‌వీన్ పోలిశెట్టి కూడా ఒక‌రు. త‌న ప్రీవియ‌స్ సినిమాల‌తో ఆడియ‌న్స్ ను ఎంత‌గానో అల‌రించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌వీన్ పోలిశెట్టి డిఫ‌రెంట్ సినిమాల‌ను మాత్ర‌మే కాకుండా వాటిని చాలా డిఫ‌రెంట్ గా ప్ర‌మోట్ చేసి ఆడియ‌న్స్ వ‌ద్ద‌కు తీసుకెళ్తాడు. అలాంటి న‌వీన్ నుంచి అన‌గ‌న‌గా ఒక రాజు అనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంక్రాంతి కానుక‌గా అన‌గ‌న‌గా ఒక రాజు

ఈ సినిమాతో మారి అనే కొత్త ద‌ర్శ‌కుడు టాలీవుడ్ కు ప‌రిచ‌యమ‌వుతుండ‌గా, మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో రూపొందిన అన‌గ‌న‌గా ఒక రాజు సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టింది.

పోలిశెట్టి మీట్స్ పికిల్ బాల్ పేరుతో ఈవెంట్

అందులో భాగంగానే రీసెంట్ గా చిత్ర యూనిట్ పోలిశెట్టి మీట్స్ పికిల్ బాల్ అనే ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా, ఆ ఈవెంట్ కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. మొద‌ట్లో ఈ ఆలోచ‌న కాస్త వింత‌గా అనిపించిన‌ప్ప‌టికీ త‌ర్వాత ఆ వీడియో మాత్రం అంద‌రూ మాట్లాడుకునేలా చేయ‌డంతో పాటూ సినిమాపై ఉన్న హైప్ ను బాగా పెంచేసింది.

పికిల్ బాల్ గురించి ఇప్పుడే తెలుసుకున్నా

ఈ వీడియోలో న‌వీన్ మాట్లాడుతూ, తన‌కు ఆ గేమ్ గురించి తెలియ‌ద‌ని, ఇప్పుడే తెలుసుకున్నాన‌ని, గూగుల్ లో వెతక‌డంతో పాటూ చాట్ జీపీటీని అడిగితే పికిల్ బాల్ అనేది ధ‌న‌వంతుల టెన్నిస్ అని చెప్పింద‌నడంతో అక్క‌డి వాతావర‌ణమంతా ఒక్క‌సారిగా న‌వ్వుల‌తో మార్మోగింది. ఈ ఈవెంట్ లో న‌వీన్ పోలిశెట్టితో పాటూ చిత్ర నిర్మాత నాగ‌వంశీ పాల్గొన‌గా, వారితో పాటూ హైద‌రాబాద్ పికిల్ బాల్ లీగ్ ను నిర్వ‌హిస్తున్న నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాల‌, సుశాంత్ పాల్గొని సినిమాకు బూస్ట‌ప్ ను ఇచ్చారు.

అక్క‌డితో అయిపోలేదు. అన‌గ‌న‌గా ఒక రాజు మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే, తాను సొంత పికిల్ బాల్ టీమ్ ను కొంటాన‌ని, త‌న టీమ్ కు న‌ల్ల‌కుంట నాటీస్ లేదా చిక్క‌డ‌ప‌ల్లి చీతాస్ అనే వాటిలో ఏదొక పేరును ఫిక్స్ చేస్తాన‌ని కూడా చెప్పాడు న‌వీన్. ఇదంతా విని అక్క‌డి ఆడియ‌న్స్ స‌ర‌దాగా న‌వ్వుకోగా, ఈ ఈవెంట్ ద్వారా అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాకు మాత్రం మంచి ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఈవెంట్ చివ‌ర‌లో ఆడియ‌న్స్ తో క‌లిసి సినిమాలోని భీమ‌వ‌రం బ‌ల్మా సాంగ్ కు న‌వీన్ స్టెప్పులు కూడా వేశారు.