'అనగనగా ఒక రాజు'.. అసలు లాభాలు ఎంత?
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు.
By: M Prashanth | 21 Jan 2026 6:08 PM ISTటాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. సంక్రాంతి రేసులో సైలెంట్‌గా వచ్చి వసూళ్ల పరంగా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' మొదటి వారం పూర్తి చేసుకునే సరికి మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. భారీ సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, తనదైన కామెడీ టైమింగ్‌తో నవీన్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు.
ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసి, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది. సంక్రాంతి సీజన్ నవీన్ పొలిశెట్టికి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ జర్నీ, ఏడు రోజులు ముగిసేసరికి ఒక సాలిడ్ హిట్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం వస్తున్న వసూళ్లన్నీ నిర్మాతలకు, పంపిణీదారులకు అదనపు లాభాలే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక అంచనాల ప్రకారం అనగనగా ఒక రాజు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 71.05 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే (ఏపీ, తెలంగాణ) 48.40 కోట్ల గ్రాస్ వసూలైంది. నైజాం ఏరియాలో 9.98 కోట్ల షేర్ రాగా, ఆంధ్రా మరియు రాయలసీమలో కూడా సినిమా స్ట్రాంగ్‌గా నిలబడింది. పెద్ద సినిమాల తాకిడి ఉన్నా, నవీన్ కామెడీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవ్వడమే ఈ రేంజ్ వసూళ్లకు ప్రధాన కారణం.
ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ సుమారు 28 కోట్ల వరకు జరగగా, వారం రోజుల్లోనే 39.46 కోట్ల షేర్ సాధించి 11.46 కోట్ల భారీ లాభాలను మిగిల్చింది. అంటే కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమా సూపర్ హిట్ క్లబ్‌లో చేరిపోయింది. నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు, అక్కడ దాదాపు 8.10 కోట్ల షేర్ వసూలైంది.
పండుగ రోజుల్లో రోజుకు సగటున 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా, వర్కింగ్ డేస్‌లో కూడా డీసెంట్‌గా నిలబడింది. ఆరో రోజు 2.57 కోట్లు, ఏడో రోజు 1.87 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి తన పట్టు నిలుపుకుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో నవీన్ చేసిన 'రాజు' క్యారెక్టర్ అందులోని కామెడీ ఎలిమెంట్స్ సినిమాను గట్టెక్కించాయి. ముఖ్యంగా యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. 'జాతి రత్నాలు' తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కామెడీని ఈ సినిమాతో అందించారని ఆడియన్స్ ఫీలవుతున్నారు. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వెళ్ళిన ఈ 'రాజు', లాంగ్ రన్‌లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
