నవీన్ కూడా క్లబ్ లో జాయిన్ అయ్యాడుగా..!
సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి.
By: Ramesh Boddu | 20 Jan 2026 11:52 AM ISTఛాన్స్ వచ్చినప్పుడే మనం ఏంటో ప్రూవ్ చేసుకుంటే కెరీర్ టర్న్ అయిపోతుంది. అలాంటి కరెక్ట్ టైం లో తమ టాలెంట్ తో దూసుకెళ్తున్నారు యువ హీరోలు. వారిలో జాతిరత్నం నవీన్ పొలిశెట్టి ఐతే కేవలం హీరోగానే కాదు రైటర్, స్క్రీన్ ప్లే అంటూ మల్టీ టాలెంట్ తో అలరిస్తున్నాడు. సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నవీన్ పొలిశెట్టి. సినిమా రిలీజై సక్సెస్ అవ్వడమే కాదు నవీన్ ఖాతాలో తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది. 100 కోట్ల క్లబ్ లోకి నవీన్ పొలిశెట్టిని నిలబెట్టింది అనగనగా ఒక రాజు.
సంక్రాంతి సీజన్ సినిమాకు బాగా కలిసి..
సినిమా అంతా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే మెయిన్ పాయింట్ గా పెట్టుకుని మరీ చేశాయి. వేరే సీజన్ లో వస్తే ఎలా ఉండేదో కానీ సంక్రాంతి సీజన్ సినిమాకు బాగా కలిసి వచ్చింది. పోటీగా మరో నాలుగు సినిమాలు ఉన్నా కూడా అనగనగా ఒక రాజు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు యువ హీరోలకు మొదటి టార్గెట్ గా ఉన్న 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
అనగనగా ఒక రాజు సినిమా అసలైతే రెండేళ్ల క్రితమే స్టార్ట్ అయ్యింది. కానీ ఆ సినిమా టైంలో నవీన్ కి యాక్సిడెంట్ అవ్వడం అతను సినిమాకు గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఐతే అనగనగా ఒక రాజు సినిమా మొత్తం బాధ్యత తన మీద వేసుకుని నవీన్ పొలిశెట్టి పనిచేశాడు. అందుకే ఇప్పుడు వస్తున్న ఈ అభినందనలకు అన్నిటికీ అతను అర్హుడు అనిపిస్తుంది.
యువ హీరోల్లో 100 కోట్లు కొట్టి సత్తా చాటాడు..
యువ హీరోల్లో 100 కోట్లు కొట్టి తన సత్తా చాటాడు నవీన్ పొలిశెట్టి. ఒక్కో సినిమాకు 2 ఏళ్లు తీసుకుంటున్నాడు అన్న కంప్లైంట్ ఉన్నా కూడా నవీన్ సినిమా వస్తే కచ్చితంగా చూసేయాలి అనే రేంజ్ లో అతని ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. అనగనగా ఒక రాజు అయితే పోటీలో ఉన్న మెగాస్టార్ ఎం.ఎస్.జి తో పాటు మిగతా సినిమాలతో కూడా టఫ్ ఫైట్ ఇస్తూ వస్తుంది.
అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ రైటర్ గా కూడా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. మారి అని పేరుకే డైరెక్టర్ ని పెట్టారు కానీ ఇదంతా నవీన్ టీం ఎఫర్ట్ వల్లే జరిగిందని తెలుస్తుంది. కచ్చితంగా నవీన్ ఈ సక్సెస్ తో ఆడియన్స్ లో తన మీద బలమైన ముద్ర వేసుకునేలా చేశాడు. ఇదే పాజిటివిటీ బజ్ తో నవీన్ కెరీర్ దూసుకెళ్లాలని ఆడియన్స్ కోరుతున్నారు.
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో అన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకోగా అనగనగా ఒక రాజు సినిమా మాత్రం నవీన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ మౌత్ టాక్ తో బలంగా దూసుకెళ్తుంది. సినిమాతో 100 కోట్లు కొట్టిన నవీన్ హీరోగా ఒక కొత్త మైల్ స్టోన్ రీచ్ అయ్యాడని చెప్పొచ్చు.
అంతకుముందు యాక్టర్ గా చిన్న చిన్న రోల్స్ చేసిన నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో అదరగొట్టగా జాతిరత్నాలుతో దుమ్ము దులిపేశాడు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా ప్రాఫిటబుల్ వెంచర్ కాగా లేటెస్ట్ గా అనగనగా ఒక రాజు కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. సో నవీన్ తో సినిమా అంటే అది పక్కా హిట్ అనేలా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.
