Begin typing your search above and press return to search.

మస్క్ రాకెట్స్, నాగవంశీ పటాకులు.. పోలిశెట్టి దివాళీ బ్లాస్ట్ అదుర్స్!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

By:  M Prashanth   |   20 Oct 2025 1:42 PM IST
మస్క్ రాకెట్స్, నాగవంశీ పటాకులు.. పోలిశెట్టి దివాళీ బ్లాస్ట్ అదుర్స్!
X

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకోగా.. కొద్ది రోజుల క్రితమే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల జ్యువెలరీ యాడ్ స్పూఫ్‌ తో వెరైటీగా ఉన్న కామెడీ ప్రోమో రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా.. దివాళీ బ్లాస్ట్ పేరుతో మరో వీడియో విడుదల చేశారు. అది నెట్టింట వైరల్ గా మారింది.

రాజు రాకెట్స్ పేరుతో దీపావళి పటాకులు షాప్ ను నడుపుతారు నవీన్. ఆ సమయంలో వచ్చిన కస్టమర్స్ తో ఓ రేంజ్ లో కామెడీ చేస్తారు. ఏమున్నాయ్ అని అడిగితే.. పట్టు చీరలు ఉన్నాయని ఫన్నీగా చెబుతారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్.. మార్స్ లో నీళ్లున్నాయో లేదనని పంపిన రాకెట్ సేమ్ పీస్ ఉన్నాయని పటాకులు చూపిస్తారు.

వ్యారెంటీ కోసం మస్క్ పిక్ కూడా వేశామని చెబుతారు. ఆ తర్వాత నిర్మాత నాగవంశీ ఫోటోతో ఉన్న ధమాకా పటాకులు ఖతర్నాక్ ఉన్నాయని అంటారు. భారత్, పాక్ వార్ కే తానే బాంబులు సప్లై చేశానని అంటారు. ఆ తర్వాత హీరోయిన్ మీనాక్షితో ఉన్న పటాకులు తన పర్సనల్ అంటూ దుకాణంలో ఫుల్ గా సందడి చేస్తారు.

చివరగా.. అన్నీ ఒకే ఐటమ్ లో కావాలంటే అనగనగా ఒక రాజు అంటూ తన ఫోటోతో ఉన్న కాంబో ప్యాక్ ను తీసుకెళ్లాలని చెబుతారు నవీన్. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అన్నీ ఉంటాయని, దివాళీకి వెలిగిస్తే.. సంక్రాంతికి వరకు పేలుతూనే ఉంటుందని అంటారు. పాటలు, ట్రైలర్, ఇంటర్వ్యూలు ఉంటాయని స్పెషల్ గా చెబుతారు.

దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నట్లు నవీన్ పోలిశెట్టి పరోక్షంగా తెలిపారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు చెప్పారు. సంక్రాంతికే సినిమా విడుదల అవుతుందని మళ్లీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన దివాళీ బ్లాస్ట్ వీడియో వైరల్ గా మారగా.. స్పెషల్ ప్రమోషనల్ వీడియో అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. మారి దర్శకత్వం వహిస్తుండగా... నవీన్, మీనాక్షిలతో పాటు రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.