Begin typing your search above and press return to search.

భయం పుట్టించేలా నవీన్ చంద్ర ‘నాట్ ఏ డాక్టర్’

టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించే బ్యానర్‌గా ‘స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్’కు మంచి పేరుంది.

By:  M Prashanth   |   15 Feb 2026 4:40 PM IST
భయం పుట్టించేలా నవీన్ చంద్ర ‘నాట్ ఏ డాక్టర్’
X

టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించే బ్యానర్‌గా ‘స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్’కు మంచి పేరుంది. నాణ్యమైన కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే ఈ సంస్థ, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో ముందుకు రానుంది. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ‘భానుమతి రామకృష్ణ’ వంటి విలక్షణమైన సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.




మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘నాట్ ఏ డాక్టర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పోస్టర్ చూస్తుంటే ఇదొక సస్పెన్స్ లేదా హర్రర్ థ్రిల్లర్ కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. సాధారణంగా డాక్టర్ అనగానే ప్రాణాలు కాపాడే వ్యక్తిగా చూస్తాం, కానీ టైటిల్ అందుకు భిన్నంగా ఉండటం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

ఇక ఈ సినిమా పోస్టర్ చాలా భయంకరంగా, గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది. అడవిలోని నేల లోపలి నుండి ఒక భారీ చెయ్యి బయటకు వస్తున్నట్లుగా ఉన్న విజువల్స్ వణుకు పుట్టిస్తున్నాయి. ఆ చెయ్యి గోళ్లు మురికిగా ఉండటం, వేలికి కట్టు కట్టి రక్తం కారుతుండటం చూస్తుంటే సినిమాలో ఏదో పెద్ద మిస్టరీ ఉందని అర్థమవుతోంది. ఆ చెయ్యి చెట్టు వేర్ల మధ్య నుండి రావడం ఆ చుట్టూ ఉన్న చీకటి వాతావరణం సినిమాలోని థీమ్ ని హైలెట్ చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాకు ఇచ్చిన ట్యాగ్ లైన్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎవరూ రాయలేని లేదా ఊహించని ఒక వింత కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ ఈ ట్యాగ్ లైన్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈ ఒక్క లైన్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. రాహుల్ యాదవ్ నక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఆయన అందించిన సినిమాలు కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల, ఈ ‘నాట్ ఏ డాక్టర్’ పై కూడా సినీ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.

నవీన్ చంద్ర ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్ లతో జోరు మీదున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక విభిన్నమైన జానర్ ను ఎంచుకోవడం ఆయన కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా కాన్సెప్ట్ గురించి పెద్దగా వివరాలు బయటకు రాకపోయినా, ఈ ఫస్ట్ లుక్ తోనే మేకర్స్ గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.