Begin typing your search above and press return to search.

హ్యాపీ యానివర్సరీ.. భార్యకు ఎమోషనల్ విషెస్ తెలిపిన హీరో!

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలు తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   12 Jun 2026 12:27 PM IST
హ్యాపీ యానివర్సరీ.. భార్యకు ఎమోషనల్ విషెస్ తెలిపిన హీరో!
X

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలు తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి వేడుకలైనా.. పుట్టినరోజు వేడుకలైనా ప్రతీదీ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరో నవీన్ చంద్ర నేటితో తమ వైవాహిక బంధానికి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన భార్యకు ఎమోషనల్ గా స్పెషల్ విషెస్ తెలియజేస్తూ తమ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేశారు.





హ్యాపీ యానివర్సరీ.. భార్యకు స్పెషల్ విషెస్..

ప్రముఖ టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తాజాగా తన వివాహ బంధానికి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన భార్య, కొడుకుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ తన భార్యకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. తన భార్యతో కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూస్తున్న ఫోటోని పంచుకున్న ఆయన.." జీవితంలో ప్రతి దశలో కూడా నువ్వే నాకు తోడుగా నిలిచావు. మనం పంచుకున్న కలల నుండి మనం నిర్మించుకున్న ఈ అందమైన కుటుంబం వరకు ప్రతి క్షణం నీతో ఉన్నందువల్లే.. ఆ క్షణం ఎంతో విలువైనదిగా అనిపించింది. నీ ప్రేమకు , నీ సహనానికి , నీ సాంగత్యానికి కృతజ్ఞుడినయ్యాను. మన కోసం, సిద్ధాంశ్ కోసం ఇంకా రాబోయే అన్ని జ్ఞాపకాలతో ఇదిగో నా శుభాకాంక్షలు.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్ను.. లవ్ యు" అంటూ లవ్ హార్ట్ ఎమోజిని షేర్ చేస్తూ.. తన భార్యను ప్రేమగా కన్ను అని పిలుచుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు నవీన్ చంద్ర. ఇక నవీన్ చంద్ర పెళ్లిరోజు కావడంతో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.





నవీన్ చంద్ర ప్రేమ, పెళ్లి వివరాలు..

కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచే సెలబ్రిటీలలో నవీన్ చంద్ర కూడా ఒకరు. వివాహం జరిగిన రెండేళ్ల తర్వాత తన భార్యను 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా మొదటిసారి బహిరంగంగా పరిచయం చేశారు. ఇక ఈ జంటకు 2023 ఫిబ్రవరి 22న ఒక బాబు జన్మించారు. ఇకపోతే నవీన్ చంద్ర భార్య విషయానికొస్తే.. ఈమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడం గమనార్హం. ఈమె పేరు ఓర్మా. వీరిది ప్రేమ వివాహం. ఈమె చాలా సంవత్సరాల పాటు మలయాళం ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. మలయాళం స్టార్ డైరెక్టర్ సిద్ధిక్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. అందుకే నవీన్ చంద్ర దగ్గరకు వచ్చే ప్రతి సినిమా కథలను విని ఆమె జడ్జి కూడా చేస్తుందట. భవిష్యత్తులో ఈమె డైరెక్టర్గా మారి సినిమా తీయచ్చేమో అని ఒక సందర్భంలో నవీన్ చంద్ర కూడా చెప్పుకొచ్చారు.





నవీన్ చంద్ర కెరియర్..

నవీన్ చంద్ర కెరియర్ విషయానికి వస్తే.. కెరియర్ ప్రారంభంలో ఇతర హీరోల సినిమాలలో సైడ్ రోల్స్ చేస్తూ కెరియర్ ఆరంభించిన ఈయన.. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే తన అద్భుతమైన నటనతో మెప్పించిన ఈయన.. దళం, భం భోలేనాథ్ , త్రిపుర, లక్ష్మీదేవికి ఓ లక్కుంది , మీలో ఎవడు కోటీశ్వరుడు, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, భానుమతి రామకృష్ణ వంటి చిత్రాలలో కూడా హీరోగా నటించి ఆకట్టుకున్నారు. అలాగే మిస్ ఇండియా, నేను లోకల్, ఎవరు, అరవింద సమేత వీర రాఘవ , విరాటపర్వం, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాలలో విలన్ గా కూడా మెప్పించారు. ఇక ఓటీటీ సిరీస్లలో కూడా నటించి మెప్పించిన ఈయన.. చివరిగా హనీ అనే సినిమాలో తన అద్భుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు.