Begin typing your search above and press return to search.

తట్టుకోలేకపోతే అగ్నిపరీక్షకు రావొద్దు.. నవదీప్ లెక్క ఇదే

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 మొదలైనప్పటి నుంచి జడ్జ్ నవదీప్ పేరు ఎక్కువగానే వినిపిస్తోంది. ముఖ్యంగా ఉప్పల్ బాలు ఎలిమినేషన్ తర్వాత ఆయన మీద సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి.

By:  M Prashanth   |   17 Aug 2026 11:12 PM IST
తట్టుకోలేకపోతే అగ్నిపరీక్షకు రావొద్దు.. నవదీప్ లెక్క ఇదే
X

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 మొదలైనప్పటి నుంచి జడ్జ్ నవదీప్ పేరు ఎక్కువగానే వినిపిస్తోంది. ముఖ్యంగా ఉప్పల్ బాలు ఎలిమినేషన్ తర్వాత ఆయన మీద సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. తనను చివరి వరకు తీసుకెళ్లి కనీసం టాస్క్ కూడా ఇవ్వకుండా వీడియోల గురించి ప్రశ్నించి అవమానించారని బాలు ఆరోపించాడు. ఇప్పుడు ఆ విమర్శలకు నవదీప్ తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు.

తాను గ్రూప్ డిస్కషన్, ఇతర రౌండ్స్ దాటి చివరి వరకు వెళ్లానని ఇదివరకే ఒక విడియోలో ఉప్పల్ బాలు తెలిపారు. అక్కడ తన వీడియోలు వల్గర్‌గా ఉంటాయని, అవి దేనికి పనికొస్తాయని నవదీప్ ప్రశ్నించాడని ఆరోపించాడు. తనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లను చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదంటూ సీరియస్ గా హెచ్చరించాడు. ఆ కామెంట్స్ వైరల్ కావడంతో అగ్నిపరీక్షలో కంటెస్టెంట్స్‌ను టెస్ట్ చేస్తున్నారా లేక మరీ హార్డ్‌గా ట్రీట్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.

ఈ వివాదం మధ్య నవదీప్ మాత్రం అగ్నిపరీక్ష వెనక ఉన్న లెక్కను చెప్పాడు. బిగ్‌బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే షో అని, అక్కడ రకరకాల మనుషుల మధ్య ఉండాల్సి వస్తుందని అన్నాడు. నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఒక కంటెస్టెంట్ ఎలా రియాక్ట్ అవుతాడనేది కూడా తాము పరీక్షిస్తామని చెప్పాడు. హారర్ సినిమా చూడటానికి వెళ్లి బయపెట్టకూడదు అంటే ఎలా? బిగ్‌బాస్‌కు వచ్చి ఇలాంటి పరిస్థితులకు కూడా సిద్ధంగా ఉండాలని నవదీప్ అన్నారు.

నవదీప్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎన్ని తిట్లు వచ్చినా భరించే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్పాడు. నెగెటివ్ కామెంట్స్‌ను హ్యాండిల్ చేయలేకపోతే అగ్నిపరీక్షకు రావద్దన్నాడు. అంటే జడ్జెస్ కావాలనే కాస్త ప్రెజర్ పెడుతున్నారని ఆయన మాటల్లో అర్థమవుతోంది. అయితే కంటెస్టెంట్‌ను పరీక్షించడం ఒకటి, వ్యక్తిగతంగా హర్ట్ అయ్యేలా మాట్లాడటం మరోటి అనే వాదన కూడా సోషల్ మీడియాలో ఉంది.

నవదీప్‌కు అగ్నిపరీక్షలో ఇలాంటి వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది సీజన్ 1లో నవదీప్ చేసిన కామెంట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత ఆ మాటకు ఫీలైన వారికి ఆయన సోషల్ మీడియాలో సారీ కూడా చెప్పాడు. ఈసారి కూడా నవదీప్, బిందు మాధవి, అభిజీత్ జడ్జెస్‌గా ఉండగా శ్రీముఖి షోను హోస్ట్ చేస్తోంది.

ఆగస్టు 15 నుంచి అగ్నిపరీక్ష సీజన్ 2 స్ట్రీమింగ్ మొదలైంది. ఇక్కడి నుంచి ఎంపికైన కామనర్స్ బిగ్‌బాస్ 10లోకి వెళ్లే అవకాశం పొందనున్నారు. అందుకే సెలక్షన్స్‌లో ప్రెజర్ ఉండటం సహజమే. నవదీప్ కూడా అదే చెబుతున్నాడు. కానీ ఎంత ప్రెజర్ పెట్టాలి, ఎక్కడ ఆపాలి అన్నదే ఇప్పుడు అసలు గొడవ. ఉప్పల్ బాలు తనకు అవమానం జరిగిందంటుంటే, నవదీప్ మాత్రం ఇలాంటి కామెంట్స్‌ను తట్టుకోవడం కూడా బిగ్‌బాస్‌కు అవసరమైన పరీక్షే అంటున్నాడు.