పెళ్లిళ్ల బ్రోకర్ చెప్పిన మాటకు నటి మైండ్ బ్లాక్
ఇది పెళ్లిళ్ల సీజన్. ఈ సీజన్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు మ్యారేజ్ బ్యూరోలు తమవంతు ప్రయత్నాల్లో ఉన్నాయి.
By: Sivaji Kontham | 25 Aug 2025 9:18 AM ISTఇది పెళ్లిళ్ల సీజన్. ఈ సీజన్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు మ్యారేజ్ బ్యూరోలు తమవంతు ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ మ్యాచ్ మేకర్ ఫేం సిమా తపారియా చర్చల్లోకొచ్చారు. ఓసారి ముస్లిమ్ నటి నౌషీన్ అలీ నేరుగా సిమాను సంప్రదించి తనకు వరుడిని వెతికి పెట్టాల్సిందిగా కోరారు. అయితే ఆ సమయంలో సిమా నుంచి వచ్చిన జవాబు తీవ్ర ఆందోళనను కలిగించిందని నటి నౌషీన్ తెలిపారు.
ముస్లిములకు వివాహం కోసం మ్యాచ్ దొరకడం చాలా కష్టమని సిమా అన్నారట. కాథలిక్, సిక్కు లేదా పంజాబీ ఎవరైనా ఫర్వాలేదని చెప్పగా, ముస్లిములకు వీళ్లలో ఎవరూ దొరకరు అని చెప్పారట. తన సోదరి సూచన మేరకు తాను సిమాను సంప్రదించానని నౌషీన్ వెల్లడించారు. కానీ మతం కారణంగా ఈరోజుల్లో భాగస్వామి దొరకడం సులువు కాదని చెప్పడం ఆందోళన కలిగించిందని నౌషీన్ ఆవేదన చెందారు. తాను ముస్లిమ్ కుటుంబంలో జన్మించినా కానీ ఆ మతాన్ని అనుసరించనని ఆమె చెప్పింది.
వేరే మత విశ్వాసం కలిగి ఉంటే, హిందూ మతంలో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కుదరదు! అని సిమా అనడం తనకు షాకిచ్చిందని నౌషీన్ తెలిపింది. అయితే నాకు సరిపోయే జోడీ ఎవరు? అని కూడా నౌషీన్ అడిగారట. `కుసుమ్` సిరీస్ నటిగా నౌషీన్ పాపుల్. సిందూర్ తేరే నామ్ కా సహా పలు షోలతో పాపులరయ్యారు. బుల్లితెర, వెండితెర అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ నటి మునుముందు స్టార్ గా మరో స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.
