నేషనల్ అవార్డ్స్ ప్రైజ్ మనీని పంచుకున్న స్టార్ హీరోలు.. అసలు కథ ఇదే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
By: Madhu Reddy | 24 Sept 2025 3:36 PM ISTఇటీవల కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతల జాబితాను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఉత్తమ ప్రదర్శన అందించిన సినిమాలు, నటీనటులు, కొరియోగ్రాఫర్లు, డైరెక్టర్లు, సహాయ నటీనటులు, చైల్డ్ ఆర్టిస్టులు ఇలా ప్రతి ఒక్కరి పేర్లను ప్రకటించింది. పేర్లను ప్రకటించడమే కాదు 2025 సెప్టెంబర్ 23వ తేదీన ఢిల్లీ వేదికగా...భారతదేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డులని, ప్రశంసా పత్రాలను కూడా అందించారు. అయితే ఇందులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.అదేంటంటే ఈసారి ఉత్తమ జాతీయ చలనచిత్ర నటుడు విభాగంలో ఈ అవార్డును ఇద్దరు హీరోలు అందుకున్నారు.
అందులో ఒకరు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కాగా , మరొకరు విక్రాంత్ మాస్సే.. అట్లీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకి గానూ ఉత్తమ నటుడిగా షారుక్ ఖాన్ కి అవార్డు వచ్చింది. అలాగే విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన 12th ఫెయిల్ మూవీలో.. తన నటనతో అందరిని అబ్బురపరిచిన విక్రాంత్ మాస్సేకి కూడా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు లభించింది. అలా ఇద్దరికీ ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు రావడంతో ఈ అవార్డుకి సంబంధించిన నగదుని ఈ ఇద్దరు హీరోలు చెరి సమానంగా పంచుకున్నారు.
అయితే షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఇద్దరికీ పథకాలు, సర్టిఫికెట్లు వేరువేరుగా వచ్చినప్పటికీ .. నగదు మాత్రం ఇద్దరికీ కలిపి వస్తుంది. అలా ఉత్తమ జాతీయ చలనచిత్ర నటుడి నగదు బహుమతి రూ. 2 లక్షలు. కానీ ఈసారి షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఇద్దరికీ ఉత్తమ జాతీయ చలనచిత్ర నటులుగా అవార్డు రావడంతో ఇద్దరు ఆ రెండు లక్షల నగదు బహుమతిని చెరో లక్ష పంచుకున్నారు.. బాలీవుడ్ కింగ్ ఖాన్ గా దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ కెరీర్ లో ఫస్ట్ టైం నేషనల్ అవార్డుని అందుకున్నారు. ఇన్నేళ్ల సినీ కెరియర్ లో జవాన్ మూవీకి ఉత్తమ నటుడి అవార్డు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ జవాన్ మూవీకి ధన్యవాదాలు తెలియజేశారు..
ఇదిలా ఉండగా.. ఉమ్మడి విజేతలలో ప్రతి ఒక్కరికి ఈ నిబంధన వర్తిస్తుంది. అదేంటంటే.. ఒక విభాగంలో ఆ అవార్డుని ఇద్దరు గెలుచుకుంటే వారికి సొంతంగా పథకం మరియు సర్టిఫికెట్ వస్తుంది. కానీ ఆ కేటగిరికి వచ్చే నగదు బహుమతిని మాత్రం ఇద్దరూ పంచుకోవాలి. అయితే జాతీయ చలన చిత్ర అవార్డులలో కేవలం నటుడి విభాగంలో మాత్రమే కాకుండా పలు విభాగాలలో కూడా ఇలా ఇద్దరికి అవార్డ్స్ వచ్చాయి. మొత్తానికి అయితే ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
