నేషనల్ అవార్డ్.. విమర్శల మధ్య షారుఖ్ రెస్పాన్స్..!
71వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ట్వెల్త్ ఫెయిల్ లీడ్ యాక్టర్ విక్రాంత్ మస్సీ షేర్ చేసుకున్నారు.
By: Ramesh Boddu | 2 Aug 2025 2:18 PM IST71వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ట్వెల్త్ ఫెయిల్ లీడ్ యాక్టర్ విక్రాంత్ మస్సీ షేర్ చేసుకున్నారు. 2023 లో వచ్చిన సినిమాలకు గాను నేషనల్ అవార్డ్ ప్రకటించింది జ్యూరీ. షారుఖ్ నటించిన జవాన్ సినిమాలో అతని నటనకు గాను బెస్ట్ యాక్టర్ గా ఎంపిక చేశారు. మరోపక్క ట్వెల్త్ ఫెయిల్ లో అద్భుతమైన నటన కనబరచినందుకు విక్రాంత్ మస్సేకి కూడా అవార్డ్ ప్రకటించారు. 71వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను షారుఖ్ ఖాన్, విక్రాంత్ మస్సే షేర్ చేసుకున్నారు.
షారుఖ్ ఎన్నో గొప్ప సినిమాల్లో..
ఐతే షారుఖ్ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. తన వర్సటాలిటీతో ఎన్నో కోట్లమంది హృదయాలను గెలుచుకున్నాడు. ఐతే అప్పుడెప్పుడు రాని ఈ నేషనల్ అవార్డ్ అతను నటించిన జవాన్ సినిమాకు రావడం షాకింగ్ గా ఉంది. ఎందుకంటే జవాన్ ఒక మంచి సినిమానే కానీ ఒక విధంగా అది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. వాటికన్నా షారుఖ్ డిఫరెంట్ వేరియేషన్స్ తో చేసిన సినిమాలు అంతకుముందు చాలా వచ్చాయి. వాటిని పోలుస్తూ జవాన్ సినిమాకు షారుఖ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడం పట్ల సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు నెటిజెన్లు.
ఐతే ఈ విమర్శల మధ్య అవార్డ్ వచ్చినందుకు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తో తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం షారుఖ్ కింగ్ సినిమా చేస్తున్నారు. చేతికి గాయం అవ్వడం వల్ల కట్టుతో ఉన్నారు. ఇక అవార్డ్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు మాటల్లో నా ఆనందాన్ని చెప్పలేను.. మీ అందరి ప్రేమ వల్ల హృదయం ఉప్పొంగుతుంది. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు ఇవి అని అన్నారు షారుఖ్.
అవార్డ్ తో బాధ్యత రెట్టింప..
ఈ అవార్డుకి తనని ఎంపిక చేసిన జ్యూరీ మెంబర్స్ కు కృతజ్ఞతలు. జవాన్ సినిమా యూనిట్ కి థాంక్స్. అట్లీ ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ వస్తుందని అతను నమ్మకంతో చెప్పాడు. ఇక నాతో కలిసి పనిచేస్తున్న తన టీం కు, నా యాక్టింగ్ కి ఇబ్బంది రాకుండా ఫ్యామిలీ పిల్లలు ఎంతో సహకరిస్తారని అన్నారు షారుఖ్.
ఈ అవార్డ్ రావడంతో తన బాధ్యత రెట్టింపు అవుతుంది. ఇంకా బగా కష్టపడి పనిచేసేలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక మీదట ఇంకా మంచి సినిమాలు చేస్తానని హామీ ఇస్తున్నా అని షారుఖ్ ఖాన్ అన్నారు. ఇన్నేళ్లుగా తనని ఆదరిస్తున్న ఫ్యాన్స్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు షారుఖ్. ఇక చివరగా చేతికి గాయం అయిన కారణంగా తన సిగ్నేచర్ స్టెప్ ని ఒక్క చేత్తో చేశారు షారుఖ్.
