Begin typing your search above and press return to search.

పూల్ సైడ్ ట్రీట్: టూపీస్‌లో న‌టాషా దుమారం

ఇటీవ‌ల న‌టాషా స్టాంకోవిక్ లో చాలా మార్పు క‌నిపిస్తోంది. ముఖ్యంగా హార్థిక్ పాండ్యాకు విడాకులిచ్చిన త‌ర్వాత ఈ భామ అన్‌లిమిటెడ్ గా చెల‌రేగిపోతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   12 Feb 2026 10:05 AM IST
పూల్ సైడ్ ట్రీట్: టూపీస్‌లో న‌టాషా దుమారం
X

ఇటీవ‌ల న‌టాషా స్టాంకోవిక్ లో చాలా మార్పు క‌నిపిస్తోంది. ముఖ్యంగా హార్థిక్ పాండ్యాకు విడాకులిచ్చిన త‌ర్వాత ఈ భామ అన్‌లిమిటెడ్ గా చెల‌రేగిపోతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల న‌టాషా వ‌రుస ఫోటోషూట్లు చూడ‌గానే ఈ కామెంట్ లు రొటీన్ గా మారాయి. ఇక ఈ విదేశీ అందాల భామ‌ సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ కి కావాల్సినంత ట్రీట్ అందుబాటులో ఉంది.





ఇదంతా చూస్తుంటే.. క‌చ్ఛితంగా హార్థిక్ మాజీ భార్య‌ స్టాంకోవిక్ న‌టిగా బాలీవుడ్ లో రీఎంట్రీ కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలా కాకుండా సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం ద్వారా ఆదాయ సాముపార్జ‌న కోస‌మే ఇలా చేస్తోందా? అస‌లు న‌టాషా ఉద్ధేశ‌మేమిటి? వార‌సుడు అగ‌స్త్య పాండ్య‌ ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నాడు? ఒక బిడ్డ పుట్టాక విడాకులు ఇచ్చి ఇలా చేయ‌డం స‌రైన‌దేనా? హార్థిక్ పాండ్యాతో న‌టాషా స్నేహం కొన‌సాగుతున్న‌ట్టేనా? లేన‌ట్టా? అంటూ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు నెటిజ‌నులు.





నిజానికి నటాషా స్టాంకోవిక్ మోడల్ కం నటిగా ఇప్ప‌టికే అనుభ‌వం ఘ‌డించింది. విడాకుల తర్వాత తిరిగి తన కెరీర్‌పై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం.. ఫోటోషూట్లు చేయడం అనేది గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారికి సాధారణం. ఇది బాలీవుడ్‌లో కొత్త అవకాశాల కోసం.. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నం అని అభిమానులు భావిస్తున్నారు.





నటాషా ఇటీవ‌లి సోష‌ల్ మీడియా పోస్టులు ప‌రిశీలిస్తే.. తన వ్యక్తిగత స్వేచ్ఛను.. కెరీర్‌ను ఎంజాయ్ చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ‌త వారం రోజులుగా న‌టాషా పూల్ సైడ్ ట్రీట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇప్పుడు మ‌రోసారి టూపీస్ ధ‌రించి స్విమ్మింగ్ పూల్ లో వేడి పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోలు నెట్ లో వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి.





వ్య‌క్తిగ‌తంగా చూస్తే...

విడాకుల తర్వాత ఇలా ఓవ‌ర్ గా గ్లామ‌ర్ ఎలివేష‌న్ ఇవ్వ‌డం సరైనదేనా? అంటే ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితాన్ని వారు తమకు నచ్చినట్లుగా గడిపే హక్కు ఉంటుంది. ఒక బిడ్డకు తల్లి అయినంత మాత్రాన తన కెరీర్‌ను లేదా వ్యక్తిగత ఇష్టాలను వదులుకోవాలని లేదు. సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఆధునిక కాలంలో వ్యక్తులు తమ సంతోషానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

హార్దిక్ పాండ్యాతో స్నేహం కొనసాగుతున్నట్టేనా? అంటే.. హార్దిక్ -నటాషా పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. వారిద్దరూ కలిసి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ కుమారుడు అగస్త్య బాధ్యతలను ఇద్దరం కలిసి చూసుకుంటామని చెప్పారు. కాబట్టి కొడుకు కోసం వారు స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

కుమారుడు అగస్త్య పాండ్యా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? అంటే.. నటాషా - హార్దిక్ పాండ్యాల కుమారుడు అగస్త్య ప్రస్తుతం తన తల్లి నటాషాతోనే ఉంటున్నట్లు సమాచారం. నటాషా తన స్వదేశమైన సెర్బియాకు వెళ్లినప్పుడు కూడా అగస్త్య ఆమెతోనే ఉన్నాడు. అయితే హార్దిక్ కూడా అప్పుడప్పుడు తన కొడుకును కలుస్తూనే ఉన్నాడు. ఇప్సుడు నటాషా షేర్ చేసిన ఇన్‌స్టా ఫోటోలు చూస్తుంటే.. తన కొత్త జీవితాన్ని ధైర్యంగా ప్రారంభిస్తోందని భావించ‌వ‌చ్చు.