Begin typing your search above and press return to search.

న‌టాషా స్టాంకోవిక్ పూల్ సైడ్ ట్రీట్

నటాషా స్టాంకోవిక్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా మాజీ భార్య‌.

By:  Sivaji Kontham   |   10 Feb 2026 1:00 AM IST
న‌టాషా స్టాంకోవిక్ పూల్ సైడ్ ట్రీట్
X

నటాషా స్టాంకోవిక్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టీమిండియా ఆల్ రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా మాజీ భార్య‌. అత‌డి నుంచి విడాకులు తీసుకునే క్ర‌మంలో న‌టాషా పేరు నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. ప్ర‌స్తుతం ఈ భామ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నా కానీ, నెటిజ‌నులు ప‌దే ప‌దే వెబ్ లో త‌న గురించి త‌ర‌చి త‌ర‌చి శోధిస్తున్నారు.




దీనికి కార‌ణం న‌టాషా ఇన్‌స్టా మాధ్య‌మంలో షేర్ చేస్తున్న హా* ఫోటోషూట్లు. న‌టాషా సోష‌ల్ మీడియాను హీటెక్కించడం ఇప్పుడే కొత్తేమీ కాదు. హార్దిక్ పాండ్యా నుంచి విడిపోయిన తర్వాత మరింత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తోంది. తాజా స్విమ్ సూట్ ఫోటోగ్రాఫ్స్ నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఆసక్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీస్తున్నాయి.




న‌టాషా పూల్‌సైడ్ డిజైన‌ర్ స్విమ్ సూట్‌లో అదిరిపోయే ట్రీటిస్తోంది. పూల్ లో అలా ప్ర‌శాంతంగా నిల‌బ‌డి గ‌ట్టున ఉన్న ఫ్రూట్ స‌లాడ్ ని సేవించేందుకు న‌టాషా రెడీ అవుతోంది. అక్క‌డ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి త‌గ్గ‌ట్టు త‌న చిరున‌వ్వు కూడా హృద‌యాల‌ను గెలుచుకుంది. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది.

మోడ‌లింగ్ లో బిజీ..

నటాషా మోడ‌లింగ్ అసైన్ మెంట్స్ కి వ‌స్తే, ప్రస్తుతం ఈ విదేశీ భామ `బ్యూటీ అండ్ వెల్నెస్` బ్రాండ్లకు ప్రాధాన్యత ఇస్తోంది. ఫిబ్రవరి 2026లో ఇన్‌సైట్ కాస్మెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటాషా ఒక భారీ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. టాక్సిక్-ఫ్రీ బ్యూటీ థీమ్‌తో సాగే ప్రకటనల్లో మెరుస్తోంది. అద్భుత‌మైన ఫిట్‌నెస్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే నటాషా, పలు ప్రీమియం జిమ్ వేర్, ఫ్యాషన్ లేబుల్స్ క‌లెక్ష‌న్స్ కి మోడ‌లింగ్ చేస్తోంది. అబూజానీ సందీప్ ఖోస్లా డిజైన‌ర్ సంస్థ‌కు న‌టాషా మోడ‌లింగ్ చేస్తోంది.

తిరిగి న‌ట‌న‌లోకి..

చాలా విరామం తర్వాత నటాషా తిరిగి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతోందని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.

ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం వెబ్ సిరీస్‌లో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతేడాది ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు, మంచి స్క్రిప్ట్ వస్తే వెబ్ సిరీస్‌లలో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని న‌టాషా స్వయంగా వెల్లడించారు. ఆ త‌ర్వాత అవ‌కాశం వెతుక్కుంటూ వ‌చ్చింది. బాలీవుడ్‌లో `డిజె వాలే బాబు` వంటి సూపర్ హిట్ సాంగ్‌లో న‌టాషా న‌ర్తించింది. దీంతో కొన్ని భారీ చిత్రాల్లో ఆమె స్పెషల్ డ్యాన్స్ నంబర్స్ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

కొడుకు కోసం త్యాగం..

న‌టాషా త‌దుప‌రి వెబ్ సిరీస్ ల‌లో న‌టించేందుకు సంసిద్ధంగా ఉంది. కెరీర్‌లో డ్యాన్సర్‌గా కంటే నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యాతో విడిపోయిన తర్వాత నటాషా తన కొడుకు అగస్త్యతో కలిసి ముంబైలో ఉంటూనే, కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. తన ఇన్‌స్టా ద్వారా కేవలం గ్లామరస్ ఫోటోషూట్ల‌ను షేర్ చేయ‌డ‌మే కాకుండా, ఫిట్‌నెస్, సెల్ఫ్-లవ్ గురించి సందేశాలు ఇస్తూ మహిళా అభిమానులను ఆకట్టుకుంటోంది.