పూల్ సైడ్ నటాషా స్టాంకోవిక్ రెడ్ హాట్ ట్రీట్
హార్థిక్ నుంచి బ్రేకప్అయ్యాక నటాషా ఏం చేస్తోంది? ఆర్జనకు సంబంధించిన మ్యాటర్స్ ఎలా ఉన్నాయి? అంటే.. నటాషా ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమాల కంటే మోడలింగ్, బ్రాండ్ ప్రచారంపై ఎక్కువగా దృష్టి పెడుతోంది.
By: Sivaji Kontham | 6 Feb 2026 9:32 AM ISTమోడల్ కం నటి నటాషా స్టాంకోవిక్ టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే బ్రేకప్ కారణంగా ఒత్తిడిని ఎప్పుడూ బయటకు తెలియనివ్వదు. నటాషా ఫ్రీమైండ్ తో చిల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూల్ సైడ్ స్వేచ్ఛగా ఎరుపు రంగు బికినీలో అందాలను ఆరబోస్తూ యువహృదయాలను కొల్లగొట్టింది. ఒక బిడ్డకు మమ్మీ అనే విషయాన్ని కూడా నటాషా మర్చిపోయేలా చేస్తోంది. ఇక నటాషా నేటి జెన్ జెడ్ లో ఫిట్నెస్ ఫ్రీక్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పూల్ సైడ్ రెడ్ హాట్ బికినీలో నటాషా టోన్డ్ బాడీ సంథింగ్ స్పెషల్ గా ఎలివేట్ అయింది. ఒంపు సొంపులను రంగరించి జెన్ జెడ్ కి అవసరమైన ట్రీట్ ఇస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అయిపోతున్నాయి.
హార్థిక్ నుంచి బ్రేకప్అయ్యాక నటాషా ఏం చేస్తోంది? ఆర్జనకు సంబంధించిన మ్యాటర్స్ ఎలా ఉన్నాయి? అంటే.. నటాషా ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమాల కంటే మోడలింగ్, బ్రాండ్ ప్రచారంపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇటీవల ఒక ప్రముఖ కాస్మెటిక్స్ బ్రాండ్ ప్రచారకర్తగా క్యాంపెయిన్‌లో కనిపించింది. సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతూ బాగానే ఆర్జిస్తోంది. అయితే నటాషాకు ప్రస్తుతం సినిమాలేవీ లేవు. గతంలో `ఫ్లెష్` అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు మళ్లీ నటనా కెరీర్‌పై ఫోకస్ పెడుతోందని సమచారం. మరోవైపు సామాజిక మాధ్యమాలలో మాత్రం నటాషా స్పీడ్ గా ఉంది. డిజిటల్ క్రియేటర్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటూ, హెల్త్, బ్యూటీ టిప్స్ , రెడ్ లైట్ థెరపీ వంటి వాటి గురించి షేర్ చేస్తూ ఫాలోవర్లను అలరిస్తోంది.
హార్దిక్ - నటాషా జంట జూలై 2024లో తమ విడాకులను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త అభిమానుల్లోకి షాక్ వేవ్స్ ని పంపింది. ప్రస్తుతం వారి మధ్య ఉన్న బంధం కేవలం స్నేహబంధం. విడిపోయినా తమ కుమారుడు అగస్త్య కోసం వారిద్దరూ కలుస్తున్నారు. బిడ్డ బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నారు.
హార్థిక్ కొత్త ఎఫైర్:
ఇటీవలి వార్తా కథనాల ప్రకారం.. హార్దిక్ పాండ్యా మోడల్ మహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు పలుమార్లు నెట్టింట వైరల్ అయ్యాయి. హార్దిక్ తన కొత్త సంబంధాన్ని కన్ఫర్మ్ చేసిన సమయంలో నటాషా `ఆర్డినరీ గర్ల్` అనే పాటతో కొన్ని ప్రశాంతమైన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం తన జీవితంలో ముందుకు సాగుతూ, మళ్లీ ప్రేమలో పడటానికి తాను సిద్ధమేనని.. అయితే ఈసారి నమ్మకంతో కూడిన బంధం కోసం ఎదురుచూస్తున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. మొత్తానికి, ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాల్లో కొత్త అధ్యాయాలను మొదలుపెట్టినా, కొడుకు అగస్త్య కోసం మాత్రం స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.
