కల్కి 2 కోసం... 50 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్‌టైమ్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 24 Sept 2026 3:33 PM ISTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కల్కి విడుదలై రెండున్నర ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు దర్శకుడు నాగ్ అశ్విన్ నుంచి కల్కి 2 కి సంబంధించిన అప్‌డేట్ మాత్రం రావడం లేదు. ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉంటున్నాడు, కానీ ఈ సినిమా సీక్వెల్ కోసం డేట్లు ఇవ్వడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. మరో వైపు దర్శకుడు నాగ్ అశ్విన్ కాలయాపన చేస్తున్నాడని, కావాలని సినిమాకు బజ్ క్రియేట్ కావడానికి ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాకు సీక్వెల్ అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. కల్కి 2 ఆ అంచనాలకు తగ్గట్లుగా రూపొందించే విధంగా భారీ స్టార్ కాస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి...
నాగ్ అశ్విన్ ఒకవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సైలెంట్‌గా తాను చేయాల్సిన పని చేస్తున్నాడని, మొదటి పార్ట్‌కి వచ్చిన స్పందన నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా కాకుండా కాస్త మార్చి సెకండ్ పార్ట్‌ను రూపొందించబోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కల్కి సినిమాను భారీ స్టార్ కాస్ట్ తో రూపొందించిన విషయం తెల్సిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. వారు సెకండ్ హాఫ్‌లో కనిపించబోతున్నారు. కొత్తగా సెకండ్ హాఫ్‌లో అంతకు మించి అన్నట్లుగా స్టార్స్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ నటుడు నసీరుద్దీన్ షా ను కల్కి 2 కోసం తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. కల్కి 2 కి ఉన్న బజ్ నేపథ్యంలో ఆయన ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలో కల్కి 2 మూవీ...
నసీరుద్దీన్ షా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ 50 ఏళ్లలో ఈయన హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాళి, ఇంగ్లీష్, జపనీస్‌తో పాటు పలు విదేశీ భాషల్లోనూ సినిమాలు చేశాడు. కానీ తెలుగులో మాత్రం ఈయన సినిమా చేయలేదు. ఈయన చేసిన ఇతర భాషల సినిమాలతో తెలుగులో నసీరుద్దీన్ షా కి మంచి గుర్తింపు అయితే లభించింది. కానీ సరైన సినిమాలు రాకపోవడంతో తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు నసీరుద్దీన్ షా తెలుగులో ఎంట్రీకి అంతా రెడీ అయింది. 50 ఏళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్‌లో సినిమాలు చేయని నసీరుద్దీన్ షా కల్కి 2 కోసం ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. కల్కి 2 లో ఆయన చేరికతో కచ్చితంగా ఉత్తరాదిని మంచి మార్కెట్ క్రియేట్ కావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబో మూవీ...
బాలీవుడ్‌కు చెందిన దీపికా పదుకునే 'కల్కి 2' సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటన వచ్చింది. ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరు నటిస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో బాలీవుడ్ నటిని ఎవరిని ఎంపిక చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయాన్ని ఇంకా ప్రకటించని దర్శకుడు తాజాగా నసీరుద్దీన్ షా తో చర్చలు జరిపినట్లుగా మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు నసీరుద్దీన్ షా సైతం కల్కి 2 లో నటిస్తే సినిమా స్థాయి మరింత పెరగడం ఖాయం. మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్ డబుల్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుందని, అంతే కాకుండా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని విజువల్స్‌ను, పాత్రలను, సీన్స్ ను చూస్తారు అని నాగ్ అశ్విన్ సన్నిహితులు చెబుతున్నారు. మరి వచ్చే ఏడాదిలో అయినా కల్కి 2 షూటింగ్ ప్రారంభం అయ్యి 2028 వరకు అయినా వచ్చేనా చూడాలి.
