బామ్మర్ది పెళ్లి.. అదిరిపోయే లుక్ లో తారక్..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది, యంగ్ హీరో నార్నే నితిన్ అందరికీ సుపరిచితమే.
By: M Prashanth | 10 Oct 2025 10:36 PM ISTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది, యంగ్ హీరో నార్నే నితిన్ అందరికీ సుపరిచితమే. మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఇచ్చిన నితిన్.. మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆయ్, మ్యాడ్-2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ చిత్రాలతో మెప్పించారు.
మంచి హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వరుస విజయాలతో పాపులారిటీ సొంతం చేసుకున్న నార్నే నితిన్.. రీసెంట్ గా శ్రీశ్రీశ్రీ రాజావారుతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు విభిన్న కథలు సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డ ఆయన.. వివాహ బంధంలోకి మరికొన్ని గంటల్లో అడుగుపెట్టనున్నారు. శివాని మెడలో మూడు ముళ్లు వేయనున్నారు.
అయితే నార్నే నితిన్- శివాని నిశ్చితార్థ వేడుక గత ఏడాది నవంబర్ 3న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరగ్గా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, హీరో కల్యాణ్ రామ్, వెంకటేష్, రానా దగ్గుబాటి, నిర్మాతలు చినబాబు, నాగవంశీ తదితరులు హాజరై సందడి చేశారు.
అలా ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ఇప్పుడు ఏడడుగులు వేయనున్నారు నితిన్. రీసెంట్ గా వేడుకలకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా.. ఎన్టీఆర్, ప్రణతి ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నితిన్- శివాని పెళ్లి వేడుకలోని ఎన్టీఆర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
క్రీమ్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వేసుకున్న తారక్.. ఫుల్ గడ్డంతో కనిపించారు. అయితే తారక్ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బామ్మర్ది పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలని కదా అంటున్నారు. సూపర్ అన్న అంటూ సందడి చేస్తున్నారు. ఫ్యామిలీ పిక్స్ కోసం వెయిటింగ్ అని చెబుతున్నారు. తారక్ లుక్ ను వైరల్ చేస్తున్నారు.
కాగా, నితిన్ వివాహం చేసుకుంటున్న శివాని.. టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కు కజిన్ డాటర్ అవుతుందట. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతులు.. విక్టరీ వెంకటేష్ కుటుంబానికి సమీప బంధువులని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నార్నే నితిన్ పెళ్లి హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలో ఘనంగా జరుగుతోంది.
