టీజర్ టాక్: భామల మధ్య నలిగిపోయే శర్వా..
టీజర్ లో ప్రధాన బలం శర్వానంద్ లుక్ అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. కామెడీ టైమింగ్ లో శర్వాకు మంచి పట్టు ఉంది.
By: M Prashanth | 22 Dec 2025 6:34 PM ISTటాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరున్న శర్వానంద్, ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయి సక్సెస్ చూడలేదు. అందుకే ఒక బిగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సీరియస్ కథలకు కాస్త బ్రేక్ ఇచ్చి, తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జోనర్ ని ఈసారి నమ్ముకున్నాడు. 'సామజవరగమన' లాంటి ఎంటర్టైనర్ ఇచ్చిన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో 'నారి నారి నడుమ మురారి' సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే, ఇది శర్వానంద్ మార్క్ ఫన్ మూవీలా అనిపిస్తోంది, కానీ కథలో కొత్తదనం ఎంత ఉందనేది చూడాలి.
కథ విషయానికి వస్తే, ఇది తెలిసిన పాత ఫార్ములానే గుర్తుచేస్తోంది. పెళ్లి సెటిల్ అయిన హీరో లైఫ్ లోకి సడెన్ గా ఎక్స్ లవర్ రావడం, అక్కడి నుంచి మొదలయ్యే కన్ఫ్యూజన్ డ్రామా. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన పాయింటే అయినా, ట్రీట్మెంట్ లో ఏమైనా కొత్త మ్యాజిక్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరం. హీరో ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే కాన్సెప్ట్ రొటీన్ గా అనిపించినా, దాన్ని ఎంత ఎంగేజింగ్ గా తీర్చిదిద్దారనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.
టీజర్ లో ప్రధాన బలం శర్వానంద్ లుక్ అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. కామెడీ టైమింగ్ లో శర్వాకు మంచి పట్టు ఉంది. అయితే డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈసారి పూర్తిగా సిచువేషనల్ కామెడీ మీద డిపెండ్ అయినట్లు తెలుస్తోంది. నరేష్, వెన్నల కిషోర్, సునీల్ లతో వచ్చే సీన్స్ టీజర్ లో హైలైట్ అయ్యాయి. "ప్రాబ్లం ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కాదు.. ఈఎంఐ" అనే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది.
హీరోయిన్లు సంయుక్త, సాక్షి వైద్య గ్లామర్ పరంగా ఓకే అనిపిస్తున్నారు. అయితే టీజర్ లో చూపించిన కెమిస్ట్రీ సినిమా మొత్తం వర్కవుట్ అయితేనే ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ప్లస్ అయ్యింది.
సంక్రాంతి రేసులో కేవలం ఎంటర్టైన్మెంట్ నమ్ముకుని రావడం ఒక రకంగా సేఫ్ గేమ్. ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. కానీ పండక్కి గట్టి పోటీ ఉంటుంది కాబట్టి, రొటీన్ కామెడీ కాకుండా కథనంలో పదును ఉంటేనే సినిమా నిలబడుతుంది. జనవరి 14న విడుదలవుతున్న ఈ చిత్రం, శర్వానంద్ ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
