ప్రముఖ హీరోయిన్ సీక్రెట్ పెళ్లి
కానీ ఇప్పుడు టోనీ బేగ్ ని నర్గీస్ రహస్య వివాహం చేసుకుంది! అంటూ ఫరా ఖాన్ ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
By: Sivaji Kontham | 2 Sept 2025 12:30 AM ISTరాక్ స్టార్ సహా పలు హిట్ చిత్రాల్లో నటించింది నర్గీస్ ఫక్రీ. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 5లో గ్లామరస్ పాత్రతో ఆకట్టుకుంది. అంతేకాదు.. `హరిహర వీరమల్లు` చిత్రంతో టాలీవుడ్ లోను ఈ బ్యూటీ అడుగుపెట్టింది. పవన్ కల్యాణ్ నటించిన ఈ భారీ చిత్రంలో నర్గీస్ తనదైన అందం, నటప్రతిభతో ఆకట్టుకుంది.
సినిమాలతో పాటు, వ్యక్తిగత జీవితంలోను నర్గీస్ కి బోలెడంత ప్రచారం దక్కింది. నర్గీస్ ఫక్రీ కెరీర్ ఆరంభ రోజుల్లో సహనటుడు ఉదయ్ చోప్రాతో డేటింగ్ కారణంగా నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. కానీ ఈ బంధం బ్రేక్ అయింది. ఇటీవల నర్గీస్ ఫక్రీ పూర్తిగా లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తూ మీడియాకు దూరంగా ఉంది. నర్గీస్ తన సినిమాల ప్రచారం గురించి తప్ప అనవసర పబ్లిసిటీని కోరుకోవడం లేదు.
కానీ ఇప్పుడు టోనీ బేగ్ ని నర్గీస్ రహస్య వివాహం చేసుకుంది! అంటూ ఫరా ఖాన్ ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకురాలు ఫరా ఖాన్ సరదాగా, ``టోనీ... వచ్చి మీ భార్య పక్కన నిలబడండి!`` అని అన్నారు. ఈ వ్యాఖ్య అందరినీ ఆశ్చర్యపరిచింది. నర్గీస్- టోనీ జంట సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని ఫరా ధృవీకరించింది. పెళ్లి ఫిబ్రవరి 2025లో కాలిఫోర్నియాలో జరిగింది.. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో హనీమూన్ జరిగింది. నర్గీస్ తన వ్యక్తిగత జీవితాన్ని బయటకు చెప్పకుండా దాస్తోంది. తన పెళ్లి ఫోటోలు, వీడియోలను బయటకు రిలీజ్ కాకుండా జాగ్రత్తపడింది. అయితే ఇంత ముఖ్యమైన ఘట్టం గురించి నర్గీస్ ఎందుకు దాస్తోంది? తన స్నేహితులకు అయినా చెప్పాలి కదా! అంటూ విరుచుకుపడుతున్నారు.
