అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నర్గీస్ ఫక్రీ!
ఈమె బాలీవుడ్ లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా నటనతో అంతకుమించి పెర్ఫార్మెన్స్ కనబరుస్తూ అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.
By: Madhu Reddy | 2 Nov 2025 4:00 AM ISTసెలబ్రిటీలు అంటే ఎప్పుడు గ్లామర్ లుక్ లోనే కాకుండా.. అప్పుడప్పుడు సాంప్రదాయంగా కూడా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొంతమంది చీర కట్టుకుంటే.. మరికొంతమంది లెహంగా ధరించి తమ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన అందాలతో మరొకసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసింది ప్రముఖ బ్యూటీ. ఈమె బాలీవుడ్ లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా నటనతో అంతకుమించి పెర్ఫార్మెన్స్ కనబరుస్తూ అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.
తాజాగా పీచ్ కలర్ లెహంగా ధరించి తన అందాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఈ లెహంగా అటు అబ్బాయిలనే కాదు అమ్మాయిలను, ఫ్యాషన్ ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. చాలా హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఈ లెహంగా ఈమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా నర్గీస్ ఫక్రీ తాజాగా షేర్ చేసిన ఈ గ్లామర్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నర్గీస్ ఫక్రీ కెరియర్ విషయానికొస్తే.. 1979 అక్టోబర్ 20వ తేదీన జన్మించిన ఈమె అమెరికన్ కి చెందిన భారతీయ మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. నటిగా 2011లో రాక్ స్టార్ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే ఉత్తమ నటన కనబరిచి ఉత్తమ మహిళా నటిగా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికయింది. బాలీవుడ్లో చాలా సినిమాలలో చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మించారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ చేసిన మొదటి చిత్రం ఇది.
ఇకపోతే నర్గీస్ ఫక్రి హీరోయిన్ గానే కాకుండా పలు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి సందడి చేసింది. అంతే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటించిన ఈమె మంచి సింగర్ గా కూడా పేరు దక్కించుకుంది. ఇక ఇప్పుడు మాఫియా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఒకవైపు సినిమాలు మరొకవైపు మ్యూజిక్ వీడియోలలో కనిపిస్తూ సందడి చేస్తున్న నర్గీస్ అభిమానులకు దగ్గర అవడానికి పలు రకాల గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
