ప్రేమ ఎంత ఖరీదైనది.. ఫక్రీ కార్ గిఫ్ట్
పవన్ కల్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటించింది నర్గీస్ ఫక్రి.
By: Sivaji Kontham | 22 Nov 2025 7:00 PM ISTపవన్ కల్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటించింది నర్గీస్ ఫక్రి. ఈ బాలీవుడ్ బ్యూటీ చాలా కాలంగా అవకాశాల్లేక కెరీర్ పరంగా డల్ అయిపోయిన సమయంలో పవర్ స్టార్ ఆఫర్ ఉత్తేజం నింపింది. కానీ వీరమల్లు తనకు సౌత్ లో అవకాశాల్ని కల్పించలేదు. 2025లో రెండు భారీ చిత్రాల్లో నటించినా అవేవీ కలిసి రాలేదు. హౌస్ ఫుల్ 5 మంచి కలెక్షన్లు తెచ్చినా దానివల్ల నర్గీస్ కి కలిసొచ్చిందేమీ లేదు. మస్తీ 4 లాంటి అడల్ట్ కామెడీ కూడా ఏమాత్రం తనకు వర్కవుట్ కాలేదు. ఇది నిరాశాజనకమైన ఏడాదిగానే ముగిసింది.
అందుకే ఇప్పుడు 2026లో తన కెరీర్ ని రీవ్యాంప్ చేసేందుకు నర్గీస్ సిద్ధమవుతోంది. ఈసారి కథాబలంతో పాటు, తన పాత్రకు కూడా మంచి గుర్తింపు ఉండాలని కోరుకుంటోందిట. కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళంలోను నటించాలని ఉవ్విళ్లూరుతోందని తెలుస్తోంది.
అంతకంటే ముందే ఈ బ్యూటీకి పెళ్లయిందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. నర్గీస్ ఈ ఏడాది ఆరంభం తన ప్రియుడు టోనీ బేగ్ ని పెళ్లాడింది. ఎలాంటి హంగామా లేకుండా అమెరికా -కాలిఫోర్నియాలో అతడిని పెళ్లాడిన నర్గీస్ ప్రస్తుతం సంసార జీవనంలో తలమునకలుగా ఉంది. కెరీర్ కంటే ఇప్పుడు తన భర్త ఆలనాపాలనా కూడా చాలా ముఖ్యం. అతడి సాంగత్యంలో అన్ని ఒత్తిళ్లను మర్చిపోతోంది. ఇప్పుడు నర్గీస్ 46వ పుట్టినరోజున టోనీ ఆమెను ఒక క్రేజీ రోల్స్ రాయిస్‌తో ఆశ్చర్యపరిచాడు.
దాదాపు 10.3 కోట్ల రూపాయల విలువైన నీలిరంగు రోల్స్ రాయిస్ ని నర్గీస్‌కు కానుకగా ఇచ్చాడు టోనీ. తనకు అందిన ఖరీదైన కార్ గిఫ్ట్ ని చూసుకుని నర్గీస్ ఏ రేంజులో మురిసిపోతోందో ఇదిగో ఈ దృశ్యాన్ని చూసి అర్థం చేసుకోవాలి. ఎరుపు రంగు గౌను.. కళ్లకు గాగుల్స్ ధరించి స్టైలిష్ గా రోల్స్ రాయిస్ కార్ టాప్ పై కూచుంది. నిజంగా నర్గీస్ రాజసం అబ్బురపరుస్తోంది. ప్రేమ ఎంత ఖరీదు! గరీబు బాబులెవరైనా కనీసం ఈ కార్ ని టచ్ అయినా చేయగలరా? అంటూ ఒకటే కామెంట్లు వినిపిస్తున్నాయ్. నర్గీస్ కెరీర్ బాలీవుడ్ లో రాక్ స్టార్ చిత్రంతో మొదలైంది. రణబీర్ కపూర్ లాంటి ట్యాలెంటెడ్ హీరో సరసన నర్గీస్ నటించింది. ఆ తర్వాత ఉదయ్ చోప్రా సహా పలువురు యంగ్ హీరోలతో నటించినా కెరీర్ కి అవి ప్లస్ కాలేదు. కానీ ఉదయ్ చోప్రాతో డేటింగ్ కారణంగా నిరంతరం హెడ్ లైన్స్ లో నిలిచింది.
